Bigg Boss 6 : బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగు 9వ వారం మరింత రసవత్తరంగా సాగుతోంది. ఎదుటి వ్యక్తి ఎమోషన్స్‌తో ఆడుకోవడం చాలా సరదాగా మారిపోయిన గీతూ ఈ వారం కూడా తన బుద్ధిని మార్చుకోలేదు. గత వారం హోస్ట్ నాగార్జున కావల్సినంత గడ్డి పెడ్డినా కూడా కుక్క తోక వంకర సామెతలా అయిపోయింది ఆమె వ్యవహారం. సొంత చెల్లిలా భావించి ఎంతో ప్రేమగా చూసుకుంటున్న బాలాదిత్య ఎమోషన్స్‌తోనే ఆడుకుంది. సిగిరెట్ తాగడం అనేది అతని పర్సనల్ వ్యవహారం. బిగ్‌బాస్ కూడా వారికి కావల్సిన సిగిరెట్స్‌ను అందిస్తున్నారు.
బాలాదిత్య తన పర్సనల్ విషయాన్ని ప్రపంచానికి చెప్పాలనుకోవడం లేదు. గతంలో కూడా ఒకసారి ఇదే విషయమై గీతూతో ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది. అయినా కూడా బుద్ధి మార్చుకోని గీతూ నేడు తిరిగి అదే పని చేసింది. మంగళవారం కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా బాలాదిత్య లైటర్, సిగిరెట్స్‌ను దాచి పెట్టి అతని ఎమోషన్స్‌తో ఆడుకుంది. బాలాదిత్య ఎమోషన్స్‌తో ఆడుకుంటూ రాక్షస ఆనందం పొందింది. గీతూని తన సొంత చెల్లిలా చూసుకున్నానని ఎవరూ ఆమె గురించి ఏం చెప్పినా తాను వినలేదని కన్నీటి పర్యంతమయ్యాడు బాలాదిత్య.
సహనం కోల్పోయి.. దారుణంగా ఏడ్చాడు. సిగరెట్ కోసం కాదు కానీ అసలు షోలో ఆ మ్యాటర్‌ని రివీల్ చేయడం బాలాదిత్యకు అసలు ఇష్టం ఉండదు. గతంలో కూడా ఇదే విషయాన్ని గీతూకి చెప్పాడు. గీతు ఎమోషనల్ బ్లాక్ మెయిల్‌ని బాలాదిత్య భరించలేకపోయాడు. తీవ్ర ఒత్తిడికి లోనైన బాలాదిత్య దారుణంగా ఏడ్చాడు. బాలాదిత్య ఎమోషన్‌ను అర్ధం చేసుకున్న ప్రేక్షకులు దానిని ఓటింగ్‌లో చూపించారు. ఈ వారం బాలాదిత్యకు బీభత్సమైన ఓటింగ్ పడింది. ప్రేక్షకులు అతడిని తీసుకెళ్లి ఏకంగా రేవంత్ తర్వాతి స్థానంలో కూర్చోబెట్టారు. ఈ ఘటన గీతూపై మరింత నెగిటివిటీని పెంచేసింది. గీతూ ప్రవర్తన ఇలాగే ఉంటే ఈ వారం కాకున్నా వచ్చే వారమైనా ఆమె ఇంటికెళ్లడం ఖాయం.