Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ అన్ని సీజన్ లలో కంటే ఆరో సీజన్ లలో కొన్ని మార్పులు చేర్పులు.. చేయటం పట్ల ఆడియన్స్ నుండి మంచి స్పందన వస్తుంది. గత ఐదు సీజన్ లలో ఒకే ఫార్మేట్ తరహాలో షో నడిచేది. కానీ సీజన్ సిక్స్ లో తొలి వారంలోనే ఎలిమినేషన్ లేకపోవడం… తోపాటు “స్టార్ ఆఫ్ ద వీక్” అనే కొత్త టాస్క్ తీసుకురావటం సంచలనం సృష్టించింది. “స్టార్ ఆఫ్ ద వీక్” అనే టాస్క్ ప్రతి ఆదివారం పెట్టనున్నట్లు నిన్న ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున ప్రకటించడం జరిగింది.

ఇదిలా ఉంటే తొలి “స్టార్ ఆఫ్ ద వీక్” టాస్క్ కెప్టెన్ బాలాదిత్య గెలవడం తెలిసిందే. ఈ క్రమంలో నిన్ననే గిఫ్ట్ అందుకున్న బాలాదిత్య.. సోమవారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో సూపర్ పవర్ కూడా సొంతం చేసుకున్నట్లు లీక్ వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే సోమవారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో ఒక్కో కంటెస్టెంట్ ఒకరిని మాత్రమే నామినేట్ చేయాలి.. అని బిగ్ బాస్ ట్విస్ట్ ఇవ్వటం తెలిసిందే. కానీ “స్టార్ ఆఫ్ ద వీక్” టైటిల్ గెలిచిన వ్యక్తి మాత్రమే ఇద్దరిని నామినేట్ చేసే సూపర్ పవర్ ఇచ్చినట్లు సమాచారం.

దీంతో సోమవారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో… బాలాదిత్య మాత్రమే ఇద్దరినీ నామినేట్ చేయనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. బాలాదిత్య హౌస్ లో చాలా యాక్టివ్ గా గేమ్ ఆడుతూ వస్తున్నాడు. అందరికీ కూడా బాలాదిత్యపై.. పాజిటివ్ ఇంప్రెషన్నే ఉంది. పైగా సీజన్ సిక్స్ లో ఫస్ట్ కెప్టెన్ కూడా కావడం జరిగింది. మరి సూపర్ పవర్ గా “స్టార్ ఆఫ్ ద వీక్” గా బాలాదిత్య ఎవరిని నామినేట్ చేస్తారో చూడాలి.
నోట్: బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం rtvmedia.in, Rtv Telugu ని సబ్‌స్క్రైబ్ చెయ్యండి!