Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కంటెస్టెంట్స్ గా ఉన్న బాలాదిత్య మొదటి వారం నుండి కూల్ గా గేమ్ ఆడుతున్నాడు. తనను ఎవరు నామినేట్ చేసినా అందుకు కారణాలు కనుక్కుని వారికి అక్కడిక్కడే క్లారిటీ ఇచ్చేస్తున్నాడు. హౌస్ లో అందరితో మంచిగా ఉంటూ హౌస్ కి పెద్దన్నలా మారిపోయాడు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహాం లేదు. ఈ పెద్దన్న మంచితనం అనే ముసుగు వేసుకున్నాడు అనే ముద్ర కూడా వేయించుకున్నాడు.
నేను ఇలానే ఉంటాను నా తీరే అంతా అని అనేకసార్లు బాలాదిత్య హౌస్ సభ్యులకు చెప్పడానికి ప్రయత్నిస్తాడు. బిగ్ బాస్ ఇస్తున్న కొన్ని కొన్ని టాస్కుల్లో ఏర్పడే విభేదాల కారణంగా ఖచ్చితంగా ఎవరో ఒకరు బాలాదిత్యను ప్రతి వారం నామినేట్ చేస్తూనే వస్తున్నారు. మామూలు సమయంలో ఎంత క్లోజ్ గా ఉన్నప్పటికీ నామినేషన్స్ సమయంలో మాత్రం నిర్మోహమాటంగా నామినేట్ చేస్తున్నారు.

లాస్ట్ వీక్ బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువగా బాలాదిత్యకే నామినేషన్లు పడ్డాయి. బాలాదిత్యను నామినేట్ చేసిన వారిలో గీతూ ఉంది. గీతూ, బాలాదిత్య మధ్య సిస్టర్ అండ్ బ్రదర్ కనెక్షన్ ఉన్నప్పటికీ ఇద్దరికి పొంతన కుదరడం లేదు. ఎక్కడో ఒకచోట విభేదాలు వస్తూనే ఉన్నాయి. దీంతో ఆ రియాక్షన్ నామినేషన్స్ లో చూపించుకోవాల్సి వస్తోంది. ముఖ్యంగా గీతూ ఎలాంటి మోహమాటం లేకుండా మొఖం మీద చెప్పేస్తుంది.
నామినేషన్స్ సమయంలో గీతూకు నేను నీకు సమాధానం చెప్పను అని బాలాదిత్య నామినేషన్ ని సున్నితంగా స్వీకరిస్తాడు. నామినేషన్స్ తర్వాత కూడా వెళ్లి తనకు ఇష్టమైన చెల్లిగా పిలుచుకునే గీతూతోనే మరలా మచ్చట్లు పెడతాడు. అసలే నామినేషన్ చేసుకుని మరలా కూర్చుని ముచ్చట్లు పెడతారు. ఈ ముచ్చట్లలో కూడా నీవు మెచ్యూర్డ్ క్యాండెట్ కాదని గీతూ స్టెట్ మెంట్ ఇస్తుంది. దీంతో బాలాదిత్య హర్ట్ అవడంతో పాటు గీతూతో క్షమాపణ చెప్పించుకుంటాడు. గీతూ అంతా విభేదిస్తున్నా తన దగ్గరికే బాలాదిత్య వెళ్తున్నట్లు కనిపిస్తుంది ఎందుకో…?