Bigg boss 6 : రాజు ఎక్కడున్నా రాజే అంటారు. బాలాదిత్య కూడా అలాగే.. గొప్ప ప్లేయర్ కాకపోవచ్చు.. గొప్పగా ఆర్గ్యుమెంట్స్ చేయకపోవచ్చు. ఇంకా చెప్పాలంటే అసలు ఏమాత్రం బిగ్‌బాస్ హౌస్‌కి అర్హుడు కాని వ్యక్తి. ఎందుకంటే.. ఈ హౌస్‌లో ఉండాలంటే కాస్త కన్నింగ్ నేచర్ ఉండాలి. మాట ఫ్లిప్ చేసే టాలెంట్ ఉండాలి. కింద పడ్డా నాదే పైచేయి అనగలగాలి. కానీ ఈ క్వాలిటీస్‌లో ఏ ఒక్క క్వాలిటీ కూడా బాలాదిత్యలో లేదు. మరి ఆయన బిగ్‌బాస్ హౌస్‌కి ఎలా సెట్ అవుతాడు? తప్పైతే తప్పంటాడు. తప్పు చేస్తే ఒప్పుకుంటాడు.
మంచిగా ఉంటాడు.. మంచితనాన్నే పంచుతాడు. కనీసం నామినేషన్స్‌లో సైతం ట్రిగ్గర్ అవడు. ఇంత మంచి వ్యక్తి ఇన్ని సీజన్లలో ఎవరూ లేరు. ఒక్క తెలుగే కాదు.. ఏ భాషలోనూ ఉండడేమో. బిగ్‌బాస్ హౌస్ ఆయనకు ఏమాత్రం కలిసిరాక పోవచ్చు కానీ అతని మంచితనం మాత్రం ప్రపంచానికి తెలిసింది. ఇంతటి స్వీట్ పర్సన్ ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారా? అనే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పటి వరకూ ఇన్ని సీజన్లలో హౌస్ నుంచి బయటకు వెళ్లిన వారంతా అంతో ఇంతో నెగిటివిటీని మూటగట్టుకునే వెళ్లారు. కానీ బాలాదిత్య ఒక్కడే ఏమాత్రం నెగిటివిటీ లేకుండా అందరితోనూ ఒక అద్భుతమైన వ్యక్తి అనిపించుకుని మరీ బయటకు వెళ్లాడు.
ఇక ఎలిమినేషన్ తర్వాత కూడా ప్రతి ఒక్కరి గురించి ఆయన చెప్పిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.ఆదిరెడ్డికి కాన్ఫిడెంట్‌గా మాట్లాడాలని అరవొద్దని సూచించాడు. రాజ్‌కు కూడా ఇలాగే క్లారిటీగా మాట్లాడాలని తెలిపాడు. ఫైమాకు ఫెయిరా? అన్ ఫెయిరా? అనేది చూసుకుని ఆడాలని సూచించాడు. రోహిత్‌ను టెంపర్ లూజ్ అవ్వొద్దని.. ఇండిపెండెంట్‌గా ఆడాలని మెరీనాకు తెలిపాడు. ఇక సత్యకు కోపంలో మాటలు వదలొద్దని తెలిపాడు. శ్రీహాన్ ఇంటెలిజెంట్ అని డెసిషన్స్ కాస్త ఆలోచించి తీసుకోవాలన్నాడు. రేవంత్ రౌద్రంగా కనిపించే పసిపిల్లాడని.. అగ్రెషన్ తగ్గించుకోవాలని సూచించాడు. ఇనయకు ఏదైనా చెప్పే ధైర్యం ఉందని కానీ చెప్పే విధానమే మారాలన్నాడు. కీర్తిని ఆలోచన తగ్గించుకోమని.. వాసంతిని ఓటమిని నుంచి మోటివేట్ కావాలని సూచించాడు.ఇక నేడు వాసంతి ఎలిమినేట్ కానుంది.