Bad Cholesterol: మారిన మన జీవన విధానం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా మన ఆహారంలో వచ్చిన మార్పుల వల్ల శరీరంలో కొవ్వు లేదంటే కొలెస్ట్రాల్ పెరగడం మొదలవుతోంది. దీని వల్ల అనేక రకాలైన అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే మన శరీరానికి అధిక కొవ్వు లేదంటే కొలెస్ట్రాల్ అనేది ముప్పుగా మారుతుంది. అందుకే దానికి తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. మరి కొవ్వు లేదంటే కొలెస్ట్రాల్ ను ఎలా తగ్గించుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
నిమ్మకాయ:
నిమ్మకాయ మనకు ఎంతో ప్రయోజనకరంగా ఉండగా.. ఇది మన శరీరంలోని అధిక కొవ్వును కరిగించేస్తుంది. ఉదయాన్నె ఖాళీ కడుపుతో నిమ్మకాయ రసాన్ని తాగడం వల్ల కొవ్వు శాతం తగ్గుతుందట.
వెల్లుల్లి:
కొవ్వును తగ్గించుకోవాలని అనుకునే వారికి వెల్లుల్లి అద్భుతంగా పని చేస్తుంది. ఉదయం మరియు రాత్రి పూట వెల్లుల్లి తింటే ఒంట్లోని అధిక కొవ్వు తగ్గుతుంది.
Bad Cholesterol:
అర్జున బెరడు:
ఆయుర్వేదంతో ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్న అర్జున బెరడు శరీరంలోని కొవ్వును తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
చేపనూనె:
శరీరానికి ఏమాత్రం మేలు చేయని కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో చేప నూనె కూడా కీలకంగా వ్యవహరిస్తుంది. చేప నూనెలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కొవ్వు కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
మెంతి నీరు:
బరువు తగ్గాలనుకునే వారికి మరియు ఒంట్లోని అధిక కొవ్వును కరిగించాలని అనుకునే వారు మెంతి నీటిని తాగడం వల్ల ప్రయోజనం కలుగుతుంది.