Bad Cholesterol: చాలామంది శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోతుందని బాధపడుతూ ఉంటారు. అయితే శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది. మన శరీరాలకు మంచి చేసే కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్. అయితే చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతేనే మనకు ముప్పు వాటిల్లుతుంది. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాలి. ఒకవేళ మీరు కూడా చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించాలని అనుకుంటే కింద పేర్కొన్న ఆహారాలు, నియమాలు పాటించండి.
మసాలా దినుసులు తగ్గించకండి:
చాలామంది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించాలని అనుకున్నప్పుడు ముందుగా మసాలా దినుసులను తగ్గించేస్తుంటారు. కానీ మసాలా దినుసులైన పసుపు, అల్లం, దాల్చిన చెక్క, వెల్లుల్లి లాంటి సుగంధ ద్రవ్యాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఆహారంలో తినడంలో తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని గుర్తించుకోవాలి.
గ్రీన్ టీ తాగడం:
బరువు తగ్గాలని, శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకునే వారికి గ్రీన్ టీ అద్భుతంగా పని చేస్తుందని చెప్పాలి. మామూలు టీ లేదంటే కాఫీ తాగే బదులు గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ శాతం తగ్గుతుంటుంది.
Bad Cholesterol: పండ్లు, కూరగాయలు:
మనం రెగ్యులర్ గా తీసుకునే ఆహారంతో పాటు రకరకాల పండ్లను తీసుకోవాలి. కూరగాయలు మరియు పండ్లు ఎక్కువగా తినడం వల్ల శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందుతాయి. మరీ ముఖ్యంగా ఫైబర్లు, యాంటీ ఆక్సిడెంట్లు అంది, శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.