partner : జీవిత భాగస్వామితో జీవితాంతం కలిసి ప్రయాణించాల్సి ఉంటుంది. మరి అలాంటప్పుడు జీవిత భాగస్వామితో ఉన్నప్పుడు మనకు ఎలాంటి చిరాకు, అనుమానం, భయం లాంటివి ఉండకూడదు. అయితే ఈ విషయంలో మన పార్ట్ నర్ తప్పు ఎంత ఉంటుందో మన తప్పు కూడా అంతే ఉంటుందని గుర్తించాలి. ఎదుటి వ్యక్తి మాత్రమే తప్పు చేసినట్లు అపోహ పడటం ఏ రిలేషన్ కి అయినా మంచిది కాదు.
రిలేషన్ లో ఉన్నప్పుడు మన పార్ట్ నర్ విషయంలో కొన్ని అలవాట్లను మనం మార్చుకుంటే ఆ రిలేషన్ ఇంకా అద్భుతంగా ఉంటుందట. మరి మన పార్ట్ నర్ విషయంలో ఎలాంటి అలవాట్లను మార్చుకోవాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
గతం గురించి ప్రశ్నించకండి:
మీ భాగస్వామి గతం ఎలాంటిదైనా కానీ దాని గురించి అడగకపోవడం మీ రిలేషన్ ను మరింత బలపరుస్తుంది. గతం గురించి మళ్లీ మళ్లీ అడిగే అలవాటు మీకుంటే వెంటనే దానిని మానుకోండి. గతం గురించి ప్రశ్నించడం వల్ల మీ పార్ట్ నర్ మనోభావాలు దెబ్బతింటాయి.
మాటలతో వెక్కిరించడకండి:
మనలో చాలామందికి వెటకారం ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వ్యక్తులను మనం మన మాటల ద్వారా వెక్కిరించడం సాధారణమే. అయితే మంచి రిలేషన్ షిప్ ని కోరుకున్నప్పుడు మీ పార్ట్ నర్ ని మాటలతో వెక్కిరించడం మానుకోండి.
partner : ఫోన్ లేదా మెసేజ్ చేసి వేధించకండి:
మనలో చాలామందికి వారి పార్ట్ నర్లకు ఫోన్ లేదంటే మెసేజ్ లు చేసి వేధించే అలవాటు ఉంటుంది. మీరు మీ పార్ట్ నర్ దగ్గరలో లేనప్పుూడు ఫోన్ లేదా మెసేజ్ ద్వారా కాంటాక్ట్ లో ఉండటం మంచి అలవాటే. కానీ అది అవతలి వ్యక్తికి ఇబ్బందికరంగా మారకూడదు. కాబట్టి ఫోన్ లేదంటే మెసేజ్ చేసి వేధించే అలవాటు మీకుంటే వెంటనే మానుకోండి.