Avoid Alcohol: శృంగారం అనేది ఒక మధుమైన అనుభూతి. ప్రతి ఒక్కరి జీవితంలో శృంగారం అనేది ఇక భాగం. శృంగారం వలన కలిగే లాభాలు అనేకం. ఒత్తిడిని తగ్గించుకునేందుకు వ్యాయామం, ధ్యానం మాత్రమే కాదు శృంగారం కూడా ఓ సూత్రం. మానసిక ఒత్తిడి తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. వారానికి కనీసం రెండు సార్లు అంతకంటే ఎక్కువ శృంగారంలో పాల్గొంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. శృంగారాన్ని ఆస్వాదించేవారు శారీరకంగా, మానసికంగా మరింత ఆరోగ్యకరంగా ఉంటారని డాక్టర్లు గట్టిగా చెబుతున్నారు.
బెడ్ రూంలో తన భాగస్వామితో ఎక్కువసేపు శృంగారంలో పాల్గోనాలని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు. కాని కొందరు మద్యం సేవించి శృంగారం చేయాలని తహతహలాడుతుంటారు. కారణం మద్యం సేవిస్తే ఎక్కువ సేపు భాగస్వామితో పడక సుఖం పొందవచ్చుననే భావనతో ఉండటమే. దీంతో చాలా మంది శృంగారానికి ముందు మద్యం సేవిస్తూ ఉంటారు. కానీ, అది మంచిది కాదని నిపుణులు పేర్కొంటున్నారు. శృంగార ప్రక్రియ అనేది మనం తీసుకునే ఆహారంపై కూడా ఆధారపడి ఉంటుందట. సంభోగానికి మీరు ఎలాంటి తిండి తీసుకుంటున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.

ముఖ్యంగా శృంగారంలో పాల్గొనాలని అనుకుంటే మద్యం సేవించకూడదని నిపుణులు సూచిస్తున్నారు. మద్యం అనేది కాస్త విశ్రాంతికి దోహదం చేస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. అవసరానికి మించి మద్యం సేవించడం వలన మీ లైంగిక సామర్థ్యంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఎందుకంటే ఆల్కహాల్ అనేది టెస్టోస్టెరాన్‌ను తగ్గిస్తుంది. అంతేకాదు నాడీ వ్యవస్థ పనితీరు తగ్గించడంపై కూడా మద్యం ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే రక్త ప్రసరణతో పాటు మనలోని నరాల సున్నితత్వంపై మద్యం తీవ్ర ప్రభావం చూపుతుంది.
మద్యం మాత్రమే కాదు కొవ్వు పదార్ధాలు అధికంగా ఉంటే ఆహారం కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావ చూపుతుంది. మన శరీరంలోని లైంగిక అవయవాలకు కొవ్వు పదార్ధలు రక్త ప్రవాహాన్ని నెమ్మదించేలా చేస్తుంది. దీంతో శృంగారం సమయంలో చెడు వాసన వస్తుంటుందని వైద్యులు చెబుతున్నారు. దీని కారణంగా సంభోగం సమయంలో స్త్రీ, పురుషులకు ఇబ్బందిగా ఉంటుందని, అందుకే శృంగారం సుఖ భరితంగా జరగాలంటే తగిన జాగ్రతలు పాటించాల్సిందేనని నిపుణులు సలహాలు ఇస్తున్నారు.