సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి నెక్స్ట్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీని ఇండియన్ హాలీవుడ్ మూవీగా ఆవిష్కరించడానికి జక్కన్న ప్రయత్నం చేస్తున్నారు. వరల్డ్ ట్రావెలర్ గా ఈ మూవీలో మహేష్ బాబు ఉంటాడని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసారు. ఇక ఈ సినిమా జనవరి నుంచి ప్రారంభం అవుతుందనే టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఇప్పటికే హాలీవుడ్ యాక్టర్స్ ని తీసుకొచ్చిన జక్కన్న ఈ సారి అంతకుమించి స్టార్ క్యాస్టింగ్ ని మహేష్ బాబు కోసం దించబోతున్నారు అనే టాక్ వినిపిస్తుంది.
దీనికోసం హాలీవుడ్ ఫిల్మ్ క్యాస్టింగ్ ఏజెన్సీ సీఏఏతో టై అప్ అయ్యాడు. ఆ ఏజెన్సీ సినిమాలకి కావాల్సిన హాలీవుడ్ నటులని ఎంపిక చేసే బాధ్యత తీసుకుంటుంది. ఇక కలయిక సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసమే అని తెలుస్తుంది. మహేష్ బాబు సినిమా సౌత్ ఆఫ్రికాలో అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో మెజారిటీ షూటింగ్ ఉంటుంది. ఈనేపధ్యంలో హాలీవుడ్ యాక్టర్స్ ఈ సినిమా కోసం కావాల్సి ఉంటుందని తెలుస్తుంది. ఈ నేపధ్యంలో కీలక పాత్రల కోసం హాలీవుడ్ స్టార్ క్యాస్టింగ్ ని డైరెక్ట్ గా ఎంపిక చేసుకుంటున్నారని టాక్.
ఇక సూపర్ స్టార్ మూవీలోమొదటిగా మార్వెల్ ఎవెంజర్స్ సినిమాలతో పాపులర్ అయిన స్టార్ నటుడు శ్యామ్యూల్ ఎస్ జాక్సన్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. సినిమాలో మహేష్ బాబు తర్వాత అంతటి మెయిన్ లీడ్ రోల్ ఇతను పోషించబోతున్నట్లు సమాచారం. ఈయనతో పాటు విలన్ పాత్రల కోసం కూడా హాలీవుడ్ నటులనే ఎంపిక చేసుకుంటున్నారని సమాచారం. ఇక త్వరలో ఈ క్యాస్టింగ్ గురించి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసే అవకాశం ఉందని టాక్.