జేమ్స్ కెమరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన అవతార్ సినిమా 11 ఏళ్ళ క్రితం రిలీజ్ అయ్యింది. అద్భుతమైన అడ్వాంచర్ మూవీగా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన అన్ని బాషలలో సూపర్ హిట్ అయ్యింది. ఇండియాలో ఆ రోజుల్లోనే ఏకంగా వంద కోట్లకి పైగా అవతార్ సినిమా కలెక్ట్ చేసింది అంటే ఎంత పెద్ద హిట్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. ఒక మామూలు స్టోరీని పండోరా గ్రాహంలో మీద జరిగే ఆధిపత్య పోరుగా చూపించి జేమ్స్ కెమరూన్ అద్భుతం చేశారు. ఆస్కార్ అవార్డుని సైతం ఈ మూవీ గెలుచుకుంది. ఇప్పుడు అవతార్ సీక్వెల్ వచ్చే ఏడాది రాబోతుంది. ఇదిలా ఉంటే అవతార్ మొదటి పార్ట్ ని త్రీడీ వెర్షన్ లో 4కెలో మరోసారి ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేశారు.
ఇక 11 ఏళ్ళ తర్వాత సినిమా మీద ప్రేక్షకుడికి ఉన్న ఆదరణ తగ్గలేదని మరోసారి కలెక్షన్స్ తో అర్ధమైంది. త్రీడీలో అవతార్ సినిమా చూడటానికి ప్రేక్షకులు విపరీతంగా ఆసక్తి చూపించారు. అందులో అందాలు, అడ్వాంచర్ సన్నివేశాలని త్రీడీలో విజువల్ గ్రాండియర్ గా చూస్తూ ఆడియన్స్ మెస్మరైజ్ అయిపోయారు. దీంతో ఊహించని స్థాయిలో సినిమాకి కలెక్షన్స్ వచ్చాయి. ఓ విధంగా చెప్పాలంటే చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమాకి రాని విధంగా 200 కోట్లకి పైగా కలెక్షన్స్ ని అవతార్ త్రీడీ వెర్షన్ రీరిలీజ్ తో కలెక్ట్ చేసింది. ఇక ఇండియాలో అయితే ఒక్క రోజే ఏకంగా 2.8 కోట్లకి పైగా అవతార్ రీరిలీజ్ తో కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది.
ఈ కలెక్షన్స్ ప్రభంజనం చూస్తూ ఉంటే మూవీకి ఇప్పటికి ఆదరణ తగ్గలేదని అర్ధమవుతుంది. ఇక ఇండియన్ ఆడియన్స్ కూడా అవతార్ లాంటి అడ్వాంచర్ సినిమాలు చూడటానికి ఇష్టపడుతున్నారని చెప్పకనే చెబుతున్నారు. మరి మన ఇండియన్ దర్శకులు ఆ స్థాయిలో అద్భుతాలని తెరపై ఆవిష్కరించడానికి ఎంత సమయం తీసుకుంటారనేది చూడాలి. ఇప్పటికే రాజమౌళి బాహుబలి, ఆర్ఆర్ఆర్ తో సినిమాలు చేసిన అవి ఇండియనైజ్ గా ఉంటాయి అలా కాకుండా ప్రపంచం మొత్తం చూసే యూనివర్శల్ కాన్సెప్ట్ తో సినిమా చేస్తే చూడాలని అందరూ భావిస్తున్నారు.