జేమ్స్ కెమరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన అవతార్ 2 మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. ఏకంగా రెండు వేల కోట్లకి పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 160 భాషలలో 50 వేలకి పైగా స్క్రీన్స్ పై రిలీజ్ అయ్యింది. త్రీడీలో తెరకెక్కి సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చిన ఈ మూవీకి మొదటి రోజు నుంచి అద్బుతమైన స్పందన వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ వస్తూ ఉండటంతో ఇండియాలో కూడా అవతార్ 2 మూవీకి భారీగా ఓపెనింగ్స్ రావడం విశేషం. జేమ్స్ కెమరూన్ తెరపై చూపించిన అద్బుతానికి ఆడియన్స్ నుంచి విశేషమైన స్పందన వస్తుంది. విజువల్ వండర్ లా ఉందని ఆడియన్స్ పేర్కొంటున్నారు. కథ పెద్దగాలేకపోయినా విజువల్స్ ట్రీట్, యాక్షన్ ఎపిసోడ్స్ తో జేమ్స్ కెమరూన్ అద్బుతం చేసాడని చెబుతున్నారు.
ఈ నేపధ్యంలో ఈ మూవీ కేవలం నాలుగు రోజుల్లోనే 3000 కోట్లకి పైగా కలెక్షన్స్ ని అందుకోవడం విశేషం హాలీవుడ్ చరిత్రలో ఊహించని స్థాయిలో ఈ మూవీకి కలెక్షన్స్ వస్తున్నాయి. ఇక భారీ ఓపెనింగ్స్ తో మొదటి రోజే సినిమా ఏకంగా వెయ్యి కోట్లకి పైగా కలెక్ట్ చేయడం విశేషం. ఇక ఇండియాలో అయితే ఇప్పటికే ఈ మూవీ రెండు వందల కోట్లకి పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇండియాలో హైయెస్ట్ కలెక్షన్స్ సొంతం చేసుకున్న డాక్టర్ స్ట్రెంజ్ మూవీ హైయెస్ట్ కలెక్షన్ సొంతం చేసుకుంది.
అయితే ఆ మూవీ కలెక్షన్స్ ని కేవలం మూడు రోజుల్లో అవతార్ 2 బ్రేక్ చేయడం విశేషం. ఇండియన్ సినిమాలకి కూడా రాని స్థాయిలో ఇండియాలో అవతార్ 2 మూవీకి భారీ కలెక్షన్స్ వస్తూ ఉండటం విశేషం. ఇదే స్పీడ్ కంటిన్యూ అయితే ఏకంగా ఇండియాలో 500 కోట్లకి పైగా అవతార్ 2 మూవీ కలెక్ట్ చేసే అవకాశం ఉందని సినిమా విశ్లేషకులు చెబుతున్నారు. విజువల్ గ్రాండియర్ ఉండటంతో సినిమాని చూడటానికి ఇండియన్ ఆడియన్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక స్థానిక భాషలలో కూడా రిలీజ్ చేయడం అవతార్ 2 మూవీకి కలిసొచ్చే అంశం అని చెప్పాలి.