Bigg boss 6 : అసలే బిగ్‌బాస్ సీజన్ 6 చెత్త అంటే.. ఈ చెత్తకు యాంకర్ శివ రూపంలో మరో చెత్తను తీసుకొచ్చి చేర్చింది స్టార్ మా. సరే అతను ఎలాంటి వాడైతే మనకెందుకు కానీ.. తజాగా ఇతను బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన రాజ్‌ను ఇంటర్వ్యూ చేసిన తీరు ప్రతి ఒక్కరికీ మంట తెప్పించింది. అసలే రాజ్ ఎలిమినేషనే ఒక వంకర టింకర ఎలిమినేషన్ అంటూ ప్రేక్షకులు మండిపడుతుంటే.. శివ ఇంటర్వ్యూ చేసిన తీరు మరింత జుగుప్సాకరం. ఆ ప్లేస్‌లో ఏ రేవంతో ఉంటే మాత్రం శివను కొట్టేసి వెళ్లిపోయి ఉండేవాడు.
ఎలిమినేట్ అయిన వాళ్లని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేయడమే శివ ఉద్యోగమేమో అనిపిస్తుంటుంది. గత వారంలో ఎలిమినేట్ అయిన మెరీనాను కూడా ఇదే విధంగా ఇబ్బంది పెట్టినా కూడా ఆమె చాలా కూల్‌గా సమాధానం చెప్పింది. ఈ వారం రాజ్‌తోనూ అదే బిహేవియర్. తనేదో బిగ్‌బాస్‌లో ఓ రేంజ్‌లో ఆడి విన్నర్‌గా నిలిచినట్టు బిల్డప్ ఇస్తూ రాజ్‌ని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేశాడు. రాజ్ లక్‌తో వచ్చాడని.. నక్క తోక తొక్కొచ్చాడని ఇష్టానుసారంగా మాట్లాడాడు. దీనికి తనేమీ లక్‌తో లేనని రాజ్ సమాధానం ఇచ్చినా కూడా తన అతి తెలివి చూపించాడు శివ.
లక్‌తో ఎవరూ రారు కానీ నువ్వు వచ్చావంటూ తలతిక్క లాజిక్‌లతో చిరాకు తెప్పించాడు. రాజ్ ఏం మాట్లాడినా కూడా తప్పు అన్నట్టుగా తప్పుడు అర్ధాలు తీసి మరీ విసిగించాడు. బిగ్ బాస్ అంటేనే పర్సనాలిటీ షో అని.. తాను తన పర్సనాలిటీ చూపించానని రాజ్ చెబితే వింటే కదా. బిగ్ బాస్ అంటే పర్సనాలిటీ షో కాదని.. రియాలిటీ షో అంటూ చెత్త లాజిక్ తీశాడు. రాజ్‌కు చాలా కోపం వచ్చే ఉంటుంది కానీ తమాయించుకున్నాడు. ఏమీ లేకుండా 12 వారాలు ఉన్నాడని.. 70 కెమెరాలను తప్పించుకుని గేమ్ ఆడాడని.. ఇష్టానుసారంగా మాట్లాడాడు. అదే ప్లేస్‌లో ఏ రేవంతో ఉంటేనా.. సీన్ మరోలా ఉండేది. మొత్తానికి యాంకర్ శిపై ప్రేక్షకులు అయితే దుమ్మెత్తి పోస్తున్నారు.