బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘జవాన్’. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ సినిమాను తెరకెక్కించారు. సెప్టెంబర్ 7న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మూవీ రిలీజ్ కానుంది. ఈ మూవీతో షారూఖ్ సౌత్ మార్కెట్‌పై గ్రిప్ పెంచుకోవాలనుకుంటున్నారు. అందుకనే డైరెక్టర్‌తో పాటు ప్రధాన తారాగణం, సాంకేతిక నిపుణులందరినీ ఇక్కడి వారినే తీసుకున్నారు. ఈ సినిమా సక్సెస్ కావాలని ఎంటైర్ కోలీవుడ్ ఇండస్ట్రీ కోరుకుంటోంది. అందుకు కారణం.. ఒకప్పుడు బాలీవుడ్ తర్వాత కోలీవుడ్ మూవీనే అన్నట్లు ఉండేది. కానీ, ఇప్పుడు టాలీవుడ్ బాలీవుడ్‌నే డామినేట్ చేసి పారేస్తుంది. దీంతో కోలీవుడ్ మేకర్స్ పోటీ పడీ మరీ సినిమాలు తీస్తున్నారు. కోలీవుడ్ నుంచి విక్రమ్, జైలర్ సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి.

ఇప్పుడు జవాన్ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా హిట్ అయితే షారూఖ్ ఖాన్‌కి సంతోషమే. అయితే కోలీవుడ్ సహా సౌత్ టెక్నీషియన్స్ హ్యాపీగా ఫీలవుతారనటంలో సందేహం లేదు. ఎందుకంటే ఇంతకు ముందు చెప్పినట్లు డైరెక్టర్ అట్లీ సహా ప్రధాన తారాగణమంతా ఇక్కడి వారే. ఇదే విషయాన్ని అట్లీ సైతం ‘జవాన్’ ఆడియోలో చెప్పారు. ‘‘నేను సక్సెస్ సాధించవచ్చు లేదా కాకపోవచ్చు. కానీ తమిళ సినిమాను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లే ప్రయత్నమే చేస్తాను. ‘జవాన్’ సక్సెస్ అయితే నెక్ట్స్ జనరేషన్ డైరెక్టర్స్‌కి ఇదొక ట్రీట్ అవుతుంది అన్నారు . నాతో సహా డైరెక్టర్స్ అందరూ బాలీవుడ్‌లో సినిమాలు చేస్తారు’’ అని అన్నారు అట్లీ చెప్పుకొచ్చారు .
‘జవాన్’ సినిమా రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై అట్లీ దర్శకత్వంలో గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. గౌరవ్ వర్మ ఈ సినిమాకు సహ నిర్మాత. నయనతార హీరోయిన్‌గా నటించింది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఇందులో విలన్‌గా మెప్పించనున్నారు. అనిరుద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.