Vastu Tips: సాధారంగా ఇళ్లల్లో ఉప్పు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఉఫ్పుకు సంబంధించి అనేక రకాలుగా నానుడిలు ప్రచారంలో ఉన్నాయి. ఉదాహరణకు ఉప్పు ఎవరి చేతికైనా ఇస్తే ఇచ్చిన వాళ్లు తీసుకున్న వాళ్లకి అప్పులు ఇవ్వాలంటూ ఉంటారు. అంతేకాదు నిత్య జీవితంలో ఉప్పుని చేతికి ఇవ్వరు. కింద పెట్టు తీసుకుంటామని అంటూ ఉంటారు. ఉప్పును కిరాణంలో షాపులతో పాటు ఇంట్లో కూడా చేతికి ఇవ్వరు. ఇందుకు ప్రధాన కారణం ఏంటనేది తెలియకపోయినా ఇప్పటికీ వాటిని అనుసరిస్తూనే ఉంటారు.
ఉప్పు అనేది దశ దానాలలో ఓ దానం అని శాస్త్రాలు చెబుతున్నాయి. పిత్రు దానాలలో, శని దానాలలో ఉప్పుని దానం చేస్తుంటారు. ఉప్పు అనేది ఆశుభంగా కూడా చాలా మంది భావిస్తుంటారు. పూజా కార్యక్రమాల వద్ద కూడా అందుకే ఉప్పుని దూరంగా ఉంచడం మనం గమనించి ఉండము. అంతెందుకు దిష్టి కూడా అందుకే ఉప్పుతో తీస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అదే విధంగా ఉప్పు అందించడం అంటే ఒకరి రహస్యాన్ని మరొకరికి చెప్పడమేనని అని చెబుతుంటారు. అందుకే ఉప్పు ఇస్తే గొడవలు అవుతాయని కూడా అంటూ ఉంటారు. ఇలా ఎన్నో రకాలుగా ఉప్పు గురించి ప్రచారంలో ఉంది.

కొన్నిసార్లు కొన్ని వస్తువు చేయి జారి కిందపడటం సహజంగానే జరుగుతూ ఉంటుంది. ఇలా ఉప్పుతో పాటు కొన్ని పదార్థాలను నేలపై చిందిచడం అనేక దుష్ప్రభావాలకు దారి తీస్తుందని చెబుతుంటారు. వాస్తు ప్రకారం ప్రకారం అకస్మాత్తుగా ఉప్పు చేతి నుండి జారిపోతే అది దోషంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఉప్పు పతనం చంద్రుడు, శుక్రుడితో సంబంధం కలిగి ఉంటుందట. దీనివల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట. ఇక అదే వాస్తు ప్రకారం నూనె చిందటం కూడా అశుభంగా పరిగణిస్తారు. నల్ల మిరియాలు మన చేతుల నుండి చెల్లాచెదురుగా పడిపోతే సంబంధం చెడిపోతుందని నమ్ముతారు.
ఇక మన దేశంలో హిందూమతంలో దేవుళ్లను పూజించేటప్పుడు కుంకుమను చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అంతేకాదు ఇది స్త్రీల పదహారు అంశాలలో ఒకటి. ముత్తైదు మహిళలు తమ మొగుడి దీర్ఘాయువు కోసం దీనిని వర్తింపజేస్తారు. అందువల్ల కుంకుమ జారి నేలపై పడితే అది మంచి సంకేతం కాదని భావిస్తారు. ఇక మనం భోజనం చేసేటప్పుడు లేదా వడ్డిస్తున్నప్పుడు పదే పదే ఆహారం కింద పడిపోతే కూడా మంచిది కాదు.ఇలా పలు రకాలుగా ఉప్పుతో పాటు కిందపడిన వాటి విషయాల్లో మంచిది కాదని భావిస్తూ ఉంటారు.