AsiaCup: బంగ్లాదేశ్ వేదికగా జరిగిన ఈ ఆసియా కప్ లో టీమిండియా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది. అంచనాలను అందుకుంటూ చివరికి ఆసియా కప్ టైటిల్ ఎగరేసుకుపోయింది. ఇక క్రికెటర్ స్మృతి మందన స్మృతి మందన తనపై ఉన్న ఫైనల్ ఫోబియాను అధిగమించి శ్రీలంకను చిత్తుచిత్తుగా ఓడించడంలో కీలక పాత్ర పోషించింది.
ఆసియా కప్ టోర్నీ అసాంతం ఆదిపత్య ప్రదర్శనను కనబరిచిన టీమిండియా ఒక్క పాకిస్తాన్ చేతిలో మాత్రమే లీగ్ మ్యాచ్ లో ఓడిపోయింది. సెమీఫైనల్ లో థాయిలాండ్ను చిత్తుచిత్తుగా ఓడించి ఫైనల్ లో శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక పేలవ ప్రదర్శనతో నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్ల నష్టానికి 69 పరుగులు మాత్రమే చేసింది. శ్రీలంకను తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించిన రేణుక సింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ను గెల్చుకుంది.
దీంతో టీమిండియా ఆసియా కప్ గెలవడానికి పెద్దగా శ్రమించాల్సిన అవసరం రాలేదు. లక్ష్యాన్ని చేదించడానికి ఓపెనర్లు స్మృతి మందన, షేఫాలి వర్మ బరిలోకి దిగింది. మొదట్లో వరుసగా రెండు వికెట్లు నష్టపోయి కాస్త తడబడినా.. స్మృతి మందన అత్యద్భుత ప్రదర్శనతో ఆసియా కప్ మన సొంతమైంది. హార్మన్ ప్రీత్ కౌర్ స్మృతి మందనకు అండగా నిలబడడంతో స్మృతి మందన శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడుతూ 6ఫోర్లు,3 సిక్సర్లతో 51 పరుగులు చేసి నాటవుట్ గా నిలిచింది. ఇక చివరిలో స్మృతి మందన సిక్సర్ ద్వారా మ్యాచ్ ను ముగించడంతో ధోనిని గుర్తుకు తెచ్చింది.
AsiaCup:
ఇప్పటివరకు జరిగిన ఎనిమిది ఆసియా కప్పులలో టీమిండియా ఏడింటిని కైవసం చేసుకుని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. కేవలం 2018లో ఒక్కసారి మాత్రమే బంగ్లాదేశ్ ఆసియా కప్ ను గెలుచుకుంది. పాకిస్తాన్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆసియా కప్ ను గెలవకపోవడం గమనార్హం.