Ashu Reddy: ఒకప్పుడు టిక్‌టాకర్‌గా కెరీర్ ప్రారంభించిన అషూరెడ్డి బిగ్‌బాస్ షోతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే రెండుసార్లు బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా ఎంపికైనా ఈ అమ్మడు ఇప్పుడు బుల్లితెరపై యాంకర్‌గా కూడా సందడి చేస్తుంది. ఈ మధ్య కవర్ సాంగ్స్ కూడా చేస్తూ తన అందాలతో యూత్‌ను ఆకట్టుకుంటుంది. ఈమెకు ఇప్పుడిప్పుడు హీరోయిన్‌గా కూడా చిన్న చిన్న అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అషూ. తన జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని తన అభిమానులతో షేర్ చేసుకుంటుంది.
రామ్‌గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ తరువాత ఈమెకు బోల్డ్ బ్యూటీగ పేరు వచ్చింది. మనసులో ఏముంటే అది ఉన్నది ఉన్నట్లు చెప్పడం ఈమె ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. అస్సలు బిడియం లేకుండా మాట్లాడే నైజం ఈమె సొంతం.
ఇంతకీ ఏమైంది..
బోల్డ్‌గా మాట్లాడమే కాకుండా.. ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ హాట్ పిక్స్ పెట్టి కుర్రకారును హుషారెక్కిస్తుంది. అయితే కొంతమంది ఈమె పిక్స్‌ను ట్రోల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోని అషూ ఈ మధ్య మాత్రం ట్రోల్స్ చేసేవారికి గట్టిగా కౌంటర్ ఇస్తుంది. తాజాగా అషూరెడ్డి పెట్టిన ఫోటోస్ కొన్ని సోషల్‌మీడియాలో వైరల్ గారి మారి ట్రోలింగ్‌కు గురయ్యాయి. అలాంటి వారికి అషూ ఓ రీల్ చేసి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. దేశముదురు సినిమాలో రమాప్రభ చెప్పిన కామాతురాణం న భయం.. న లజ్జా.. డైలాగ్‌ని ఇన్‌స్టా రీల్‌చేసి షేర్ చేసింది.
Ashu Reddy:
కామంతో కళ్లు మూసుకుపోయిన వెధవకి సిగ్గు, లజ్జ, భయం, భక్తి ఏమీ ఉండవు అని ఈ సందర్భంగా ట్రోలర్స్‌ని హెచ్చరించింది. ఇది సినిమా డైలాగ్ అయినప్పటికీ ఉద్దేశం మాత్రం వేరే ఉందని అందరికీ అర్ధమయ్యే విధంగా ఈ పోస్ట్ చేసింది. అంతేకాకుండా ఆ రీల్‌కి క్యాప్షన్ కూడా జత చేసింది. నా ప్రొఫైల్ లో కామెంట్ చేసే కొందరికి దీనిని అంకితం అంటూ రాసుకొచ్చింది. అయితే ఈ రీల్‌కి కూడా కొందరు నెగెటివ్ కామెంట్స్ పెట్టడం విశేషం.
https://www.instagram.com/reel/CkyGASnDcOK/?igshid=YmMyMTA2M2Y=