Ashu Reddy: తెలుగు పేక్షకులకు బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అషు సోషల్ మీడియాలో డబ్ స్మాష్ వీడియోల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న విషయం తెలిసిందే. అలా సోషల్ మీడియాలో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న అషు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అషురెడ్డి క్రేజ్ మరింత పెరిగింది.బిగ్ బాస్,షో ద్వారా ఈమె రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరింత చేరువ అయింది. అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మకు బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అవకాశాలు క్యూ కట్టాయి. అషు రెడ్డి బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత యాంకర్ గా కూడా పలు షోలకు వ్యవహరించింది.
అంతేకాకుండా లేడీ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకొని తన కామెడీతో ప్రేక్షకులు నవ్వించింది. ఆ తర్వాత ఈమె కమెడియన్ ఎక్స్ప్రెస్ హరి తో లవ్ లో ఉంది అంటూ కొద్ది రోజులు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా అతనికి గిఫ్ట్ గా బైక్ ను కూడా ఇచ్చింది.
హరి కూడా అషు రెడ్డి పేరుని టాటూగా వేయించుకోవడంతో వారి మధ్య లవ్ నిజంగానే ఉంది అని అభిమానులు అనుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు మళ్లీ ఈమె రాహుల్ సిప్లి గంజ్ తో ప్రేమలో మునిగి తేలుతోంది అంటూ వార్తలు వినిపించాయి. రాహుల్ తో కలిసి చనువుగా దిగిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.
ఇక ఇది ఇలా ఉంటే అషు కి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఈమెకు యూత్లో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాకుండా అభిమానులు ఏమైనా బుల్లితెర సమంత అని కూడా పిలుస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోత గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో పొట్టి డ్రస్సును వేసుకుని థైస్, నడుము,ఎద అందాలను చూపిస్తూ యువతని రెచ్చగొడుతోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.