Bigg boss 6: బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగు ఇప్పుడిప్పుడే ప్రేక్షకులకు కావల్సినంత కంటెంట్ దొరుకుతోంది. సూర్య, ఇనయ కలిసి ఇచ్చేంత కంటెంట్ హౌస్ మొత్తం కలిసి కూడా ఇవ్వట్లేదనే చెప్పాలి. ఇనయపై కాస్త డౌట్ ఉన్నా కూడా ప్రేక్షకులు అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఎప్పుడైతే సూర్యపై క్రష్ ఉందని చెప్పిందో అప్పటి నుంచి అమ్మడికి బయట నెగిటివిటీ స్టార్ట్ అయిపోయింది. అంతకు ముందు మాట్లాడే మాటల్లో లాజిక్ లేకున్నా తన స్టాండ్ తాను గట్టిగానే తీసుకుంటోందని.. అలాగే అంతా అమ్మడిని టార్గెట్ చేశారని కొంత.. మొత్తానికి ఇనయ టాప్ 2కి ఎదిగింది.
టాప్ 5లో బెర్త్ కూడా ఇప్పటికే కన్ఫర్మ్ చేసేసుకుంది. ఇలాంటి సమయంలో సూర్యతో అమ్మడు నడుపుతున్న యవ్వారం తేడా కొట్టేస్తోంది. సూర్యతో హగ్గులు, ముద్దులు శృతి మించుతున్నాయని ప్రేక్షకులు బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. అంతకు ముందు సూర్య.. ఆరోహితో కావల్సినంత పులిహోర కలిపాడు. దీంతో చాలా బ్యాడ్ నేమ్‌తో ఆరోహి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చాక ఆరోహి మాట్లాడుతున్న మాటలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తానేం చేయలేదని ఓ నలుగురు వ్యక్తులు కావాలని తనపై బురద చల్లారని వాళ్లెవరో త్వరలోనే బయటపెడతానంటూ మంగమ్మ శపథం ఒకటి చేసింది.
అంతటితో ఆగిందా? సూర్యతో తనది కేవలం ఫ్రెండ్‌షిపేనని చెప్పుకొచ్చింది. తాజాగా అమ్మడు లైవ్‌కి వచ్చింది. అది చూసిన నెటిజన్లు అమ్మడిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యంగా సూర్య, ఇనయ గురించే ఆమెను పలు రకాలుగా నెటిజన్స్ ప్రశ్నలు అడిగారు. సూర్య, ఇనయలను చూస్తుంటే మీకేమనిపిస్తుంది? అని ఒకరు అడిగితే.. తనకు ఏమీ అనిపించడం లేదని.. తానసలు పట్టించుకోనంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. నిజానికి తానొక టామ్ బాయ్ అని.. అబ్బాయిల నుంచి ఫిజికల్ హెరాస్‌మెంట్ ఫేస్ చేయడంతో తానలా తయారయ్యానని చెప్పుకొచ్చింది.