Arohi Rao: తెలంగాణ యాసలో గలగల మాట్లాడుతూ అందరిని ఆకట్టుకున్న యాంకర్ ఆరోహి ఆలియాస్ అంజలి ప్రస్తుతం బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్నటువంటి ఈమె బిగ్ బాస్ హౌస్ కి వెళ్లకముందు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఈమె తన కన్నీటి కష్టాలను తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు.
ఈ సందర్భంగా ఆరోహి మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు వయసు ఉన్నప్పుడే తన తల్లి చనిపోయిందని, తండ్రి బాధ్యత లేకుండా మమ్మల్ని వదిలేసి వేరొక పెళ్లి చేసుకుని వెళ్లిపోయారని, చిన్నప్పటి నుంచి అమ్మమ్మ దగ్గరే పెరిగానని తెలిపారు. ఇక చిన్నప్పుడు ఇంట్లో పూట గడవడం కూడా కష్టంగా ఉండడంతో కూలి పనులకు వెళ్తూ చదువుకున్నానని ఈమె తెలియజేశారు.ఇక ఆర్థిక సమస్యల కారణంగా చదువులు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చిందని ఆరోహి ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.
నటనపై ఆసక్తి ఉండటంతో మొదట్లో వరంగల్లోని ఒక లోకల్ ఛానల్లో యాంకర్ గా పని చేశానని అప్పుడు తనకు నెలకు జీతం నాలుగు వేల రూపాయలు చెల్లించారని ఈమె తెలిపారు. మొదటిసారి నేను డబ్బింగ్ చెప్పినప్పుడు 200 రూపాయలు ఇచ్చారు. ఆ రెండు వందలు చూసి తనకు చాలా సంతోష పడ్డానని ఇంటర్వ్యూ సందర్భంగా ఆరోహి వెల్లడించారు.ఇలా నటన పై ఆసక్తితో హైదరాబాద్ వచ్చానని ప్రస్తుతం ఓ చానల్లో పనిచేస్తూ జీవితం సాఫీగా సాగిపోతుందని తెలిపారు.
Arohi Rao: రేపటి గురించి తలుచుకొని ఏడవని రోజు లేదు..
గత మూడు సంవత్సరాల నుంచి నా జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సాగిపోతుంది ఆ మూడు సంవత్సరాలకు ముందు నా జీవితంలో ప్రతిరోజు కన్నీటి కష్టాలే రేపు ఎలా అని తలుచుకొని ఏడవని రోజు అంటూ లేదు అంటూ ఈ సందర్భంగా ఈమె తన కన్నీటి కష్టాలన్నింటిని బయటపెట్టారు. ఇక జీవితంలో ఎవరితో అయినా ప్రేమలో ఉన్నారా అని ప్రశ్నించగా తన జీవితానికి లవ్ వర్కౌట్ కాలేదని పెళ్లి కుదిరి చివరి క్షణంలో ఆగిపోయింది అంటూ ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు.