BIGG BOSS: గతంలో మనం చెప్పుకున్నట్లుగానే ప్రతి బిగ్ బాస్ సీజన్ లో లవ్ ట్రాక్ ఏదో ఒక జంటకు కొనసాగుతూనే ఉంటుంది. గొడవలు, కామెటీ, ప్రేమ ఇలా అన్ని రకాల సంఘటనలు హౌస్ లో చోటు చేసుకుంటునే ప్రేక్షకులకు బిగ్ బాస్ చూడాలనే ఆసక్తి ఉంటుంది. దీంతో అన్ని షోలో ప్రేక్షకులకు కావాల్సిన వినోదం అందిలా బిగ్ బాస్ షో నిర్వాహకులు జాగ్రత్త పడతారు.
ఇందులో భాగంగానే హౌస్ లో అబ్బాయిలకు సమానంగా దాదాపుగా అమ్మాయిల సంఖ్య కూడా ఉండేలా చూసుకుంటారు. ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందించేలా టాస్క్ లు ఇస్తారు. ఇక నామినేషన్స్, ఎలిమినేషన్స్ ఎలాగూ రసవత్తరంగానే ఉంటాయి. ప్రేక్షకులకు కావాల్సింది వినోదం. దీని కోసం షో నిర్వాహకులు తాపత్రయ పడుతుంటారు. బిగ్ బాస్ హౌస్ లో ఎవరి ఏ కంటెస్టెంట్ నుండి ప్రేక్షకులు ఆశిస్తున్న కంటెంట్ వస్తుందో వారిని ఎక్కువ సేపు ఎపిసోడ్స్ లో చూపిస్తారు.

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో సూరర్య, ఆరోహి మధ్య లవ్ ట్రాక్ కొనసాగుతున్నట్లు క్రియేట్ అవుతోంది. నిజంగానే ట్రాక్ నడుస్తోందా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ వారిద్దరూ ఎక్కువగా గడపడంతో పాటు ప్రేమా,ఆప్యాయత, అనురాగాలు అప్పుడప్పుడు కోపాలతో ఉన్న సీన్లు ఎక్కువగా బిగ్ బాస్ షోలో ఈ మధ్య కనిపిస్తున్నాయి. ఈ మధ్య రాత్రి పూట కూడా వీరిద్దరూ రాత్రి పూట కూడా కలిసి చేస్తున్న యాక్టివిటీస్ గురించి షోలో చూపిస్తున్నారు.
దీంతో నిజంగానే సూర్య, ఆరోహి మధ్య ఖచ్చితంగా లవ్ ట్రాక్ నడుస్తోందని హౌస్ కంటెస్టెంట్స్ తో పాటు హోస్ట్ నాగార్జున కూడా అనుమానిస్తారు. ఓ రకంగా లేకున్నా దాన్ని నిజం చేయాలని చూస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలో ఆదివారం ఎపిసోడ్ లో ఓ ఆడియన్ వీరిద్దరిపైన తన అభిప్రాయం కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తుంది. కేవలం కంటెంట్ కోసం సూర్య, ఆరోహి ఎక్కువగా క్లోజ్ ఉన్నట్లు అనిపిస్తోందని అభిప్రాయపడింది. నిజమే బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ రోజులు కొనసాగాలంటే ఆ మాత్రం స్ట్రార్టజీ ఉండాలి. సో నిజంగా వీరిద్దరి మధ్య నిజంగా లవ్ ట్రాక్ నడుస్తోందా.. కేవలం కంటెంట్ కోసం ఇలా చేస్తున్నారా అనేది ఇంకొన్ని రోజులు బిగ్ బాస్ షో చూస్తే తెలుస్తుంది… !