BIGG BOSS: ఈ వారం కెప్టెన్సీ పోటీదారుడి కోసం బిగ్ బాస్ తన పుట్టినరోజు వేడుకను జరుకుంటున్నారు. దీంతో ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ టాస్క్ ఇస్తాడు. తన పుట్టినరోజు వేడుక సందర్భంగా బిగ్ బాస్ ను ఎంటర్ టైన్ చేయడం ఇంటి సభ్యుల బాధ్యత. సమయానుసారం బిగ్ బాస్ ఇంటి సభ్యులకు కొన్ని సర్ ప్రైజ్ లు పంపడం జరుగుతుంది. ఈ సర్ ప్రైజెస్ లో ఇంటి సభ్యులు అందరూ పూర్తి మనసు మరియు ఉత్సాహంతో పాల్గొనాల్సి ఉంటుంది.
కేవలం బిగ్ బాస్ సర్ ప్రైజ్ లు పంపినప్పుడే కాకుండా ఈ పూర్తి వేడుకలో బిగ్ బాస్ ఎల్లప్పుడూ ఎంటర్ టైన్ అవుతూ ఉండేలా ఇంటి సభ్యులు చూసుకోవాల్సి ఉంటుంది. మీరు బిగ్ బాస్ ని ఎంత ఎంటర్ టైన్ చేస్తే మీరు కెప్టెన్సీ పోటీదారులు అయ్యే అవకాశాలు అంత మెరుగు పడతాయంటూ బిగ్ బాస్ ఈ వారం టాస్క్ ప్లాన్ చేస్తాడు. తర్వాత బిగ్ బాస్ బర్త్ డే సందర్భంగా ఓ కేక్ ని పంపిస్తాడు. ఈ కేక్ కేవలం ఇద్దరు సభ్యులు మాత్రమే తినవచ్చు.

ఏ ఇద్దరు సభ్యులు తినాలో ఇంటి సభ్యులు అందరు కలిసి నిర్ణయించాల్సి ఉంటుందని రూల్ పెడతాడు బిగ్ బాస్. దీంతో ఆ కేక్ ను సంపాదించడం కోసం కంటెస్టెంట్స్ అందరూ నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తారు. ముందు బాలాదిత్య తనదైన శైలిలో పాటతో మొదలు పెడతాడు. ఇక సూర్య ఎప్పటిలాగే తన మిమిక్రితో అదరగొట్టేస్తాడు. ఆ తర్వాత అసలు సీన్ మొదలౌతుంది. రేవంత్ రంగంలోకి దిగి పాట పాడటం మొదలు పెడతాడు.
ఈ పాటకు శ్రీహాన్, శ్రీసత్య కలిసి ఓ రేంజ్ లో డ్యాన్సు వస్తారు. వారిద్దరు కలిసి వేసిన డ్యాన్స్ నిజంగానే సూపర్ గా ఉంటుంది. కానీ శ్రీసత్య, శ్రీహాన్ తో డ్యాన్స్ వేయడంతో అక్కడే ఉన్న అర్జున్ ని బిగ్ బాస్ క్లోజ్ అప్ లో చూపిస్తారు. నిజంగానే అర్జున్ ఏంటి వీరిద్దరూ ఇంతలా కనెక్ట్ అయిపోయి డ్యాన్స్ వేస్తున్నారు అనే ఫీలింగ్ తన మొఖంలో కనిపిస్తుంది. తనతో డ్యాన్సు వేయవచ్చు కదా అని కూడా అర్జున్ శ్రీ సత్యను తర్వాత అడుగుతాడు. కానీ ఇప్పుడే మనిద్దరి గురించి ఏదో అనుకుంటున్నారు. ఇక కలిసి డ్యాన్స్ వేస్తే ఇంకేమైనా ఉందా.. అవసరమా మనకు అని శ్రీసత్య చెప్పిందని అర్జునే తనతోటి వేరే కంటెస్టెంట్ కి స్వయంగా చెప్తాడు.