BIGG BOSS: బిగ్ బాస్ హౌస్ లో అర్జున్ కి తోటి కంటెస్టెంట్స్ ఊహించని షాక్ ఇచ్చారు. బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో మొదటి వారం నుండి కూడా అర్జున్ పెద్దగా కాండ్రవర్సీ లేని కంటెస్టెంట్ అనే చెప్పాలి. కాండ్రవర్సీ అవకాశాన్ని ఉపయోగించుకుని హైలెట్ అవ్వాల్సిన సమయంలో అర్జున్ ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఓ రకంగా చెప్పాలంటే బిగ్ బాస్ కి అర్హత సాధించేంత ప్రదర్శన కూడా లేదని కొందరు అంటున్నారు.
ఇక అసలు విషయంలోకి వస్తే… అర్జున్ ఎవరికోసం అయితే లాస్ట్ వీక్ లో వరస్ట్ పర్ఫామెన్స్ విషయంలో జైలుకు వెళ్తారో వారే ఇప్పుడు అర్జున్ కి ఝలక్ ఇచ్చారు. ఈ వారం వరస్ట్ పర్ఫామెన్స్ ఎంపిక ప్రక్రియలో ఎక్కువ మంది తోటి కంటెస్టెంట్స్ అర్జున్ ని నామినేట్ చేస్తారు. ఇందులో ఫైమా, దీపూ, చంటి, ఆరోహి, కీర్తి ఇలా ఫీమేల్ కంటెస్టెంట్స్ అందరూ అర్జున్ ని వరస్ట్ పర్ఫార్మర్ గా ఎంపిక చేస్తారు. దీంతో అర్జున్ బిగ్ బాస్ తదుపరి ఆదేశాల వరకు జైలుకు వెళ్తాడు.

ఇందుకు దాదాపుగా అందరూ ఒకే కారణం చెప్తారు. ఈ వారం జరిగిన హోటల్ వర్సెస్ హోటల్ టాస్క్ లో భాగంగా గెస్ట్ గా వ్యవహరించిన అర్జున్ తన డబ్బులను ఎక్కువగా గ్లామ్ ప్యారడైజ్ హోటల్ నిర్వాహకురాలిగా వ్యవహరించిన శ్రీసత్యకే ఇస్తాడు. దీంతో అదే హోటల్ నిర్వాహకులుగా ఉన్న ఫైమా, ఆరోహి, కీర్తీ హర్ట్ ఉంటారు. కానీ అర్జున్ మాత్రం శ్రీసత్యవైపే ఎక్కువగా మొగ్గు చూపి తనకే ఎక్కువగా టిప్పులు ఇస్తాడు.
దీంతో బాగా హర్ట్ అయిన వారందరూ ఈ వారం వరస్ట్ పర్పార్మర్ గా అర్జున్ నామినేట్ చేస్తారు. దీంతో జైలుకి వెళ్లిన అర్జున్ ప్రేక్షకులకు హౌస్ లోని ఓ కెమెరా ద్వారా ఓ విజ్జప్తి చేస్తాడు. ఈ ఒక్కసారి నాకు ఓటేసి సపోర్ట్ చేసి అవకాశం ఇవ్వండి ఈ సారి నేనేంటో చూపిస్తా అని చెప్తాడు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఎలా అనే సామెత అర్జున్ కి కరెక్ట్ గా సరిపోతుందేమో బహుశా..!