సౌత్ ఇండియాలో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు యాక్షన్ కింగ్ అర్జున్. తెలుగు, తమిళ బాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో అర్జున్ నటించాడు. కన్నడ నటుడు అయినా కూడా తెలుగులో అతనికి మంచి ఇమేజ్ ఉంది. ఇక అర్జున్ సర్జా తాజాగా విశ్వక్ సేన్ హీరోగా తన కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా ఒక సినిమాని స్టార్ట్ చేశారు. దర్శకుడిగా అర్జున్ చాలా సినిమాలు చేశారు. తన కూతురుని తెలుగులో పరిచయం చేయడానికి ఈ ప్రాజెక్ట్ ని చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా పాల్గొని ఈ సినిమాని ఓపెనింగ్ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి విశ్వక్ సేన్ తప్పుకున్నట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యింది. దీనిపై నటుడు, దర్శకుడు అర్జున్ మీడియా ముందుకి వచ్చి అసలు సినిమా నుంచి విశ్వక్ తప్పుకోవడం వెనుక అసలు కథ ఏంటి అనేది చెప్పుకొచ్చారు.
విశ్వక్ సేన్ కోసం ఇప్పటికే ఒక షెడ్యూల్ ని క్యాన్సిల్ చేయడం జరిగిందని, బాడీ, లుక్ చేంజ్ చేసుకుంటాను అంటే అతని మాటకి గౌరవం ఇచ్చి ఫస్ట్ షెడ్యూల్ క్యాన్సిల్ చేయడం జరిగిందని చెప్పుకొచ్చారు. అయితే తాజాగా శుక్రవారం నుంచి మళ్ళీ షెడ్యూల్ పెట్టుకున్నామని, నవంబర్ 2న షెడ్యూల్ స్టార్ట్ కావాల్సి ఉందని అయితే ఆ రోజు ఎవరో యాక్టర్ ని కలవాలని చెప్పి రాలేదని చెప్పారు. ఇక శుక్రవారం ఉదయం మెసేజ్ పెట్టి షూటింగ్ క్యాన్సిల్ చేయాలని చెప్పారని, అయితే అతని పద్ధతి తనకి ఎంత మాత్రం నచ్చలేదని చెప్పారు. ఎంతో మంది ప్రొఫెషనల్ యాక్టర్స్ తో వర్క్ చేశానని, కానీ అతను మాత్రం బాధ్యత లేకుండా అన్ ప్రొఫెషనల్ గా బిహేవ్ చేసి తనతో పాటు అతనిని నమ్మిన అందరిని కూడా అవమానించాడని అన్నారు.
ఇదే విషయం కూడా అతని మేనేజర్ కి చెప్పడం జరిగిందని తెలిపారు. ఇన్నేళ్ల కెరియర్ లో ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితి తనకి ఎదురుకాలేదని అన్నారు. అతని మీద నమ్మకంతో నేను ఎలాంటి బిజినెస్ చేయలేదని, అలాగే ఫైనాన్షియర్స్ నుంచి డబ్బులు కూడా తీసుకోలేదని అన్నారు. అలాగే ఏదో భారీ కలెక్షన్స్ వచ్చేస్తాయని ఆశతో ఈ మూవీ చేయలేదని అన్నారు. అయితే డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా, లిరిక్ రిటైర్ చంద్రబోస్, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ని పెట్టుకోవడం మొదటి నుంచి అతనికి నచ్చలేదని, అతను ఈ విషయం కారణంగా ఆలా ప్రవర్తిస్తున్నాడు అని అనుకుంటున్నా అని అన్నారు. అయితే చిత్రం నుంచి తాను తప్పుకోలేదని, కేవలం అతని ఏం అన్ ప్రొఫెషనల్ ఆటిట్యూడ్ నచ్చక నేనే ఆపేశానని చెప్పారు.