క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం అయ్యింది. ఈ షూటింగ్ లో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటున్నాడు. అతనికి సంబందించిన కీలక సన్నివేశాలని తెరకెక్కించే పనిలో దర్శకుడు క్రిష్ ఉన్నాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 70 శాతం మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపొయింది. అయితే పవన్ కళ్యాణ్ పొలిటికల్ కార్యక్రమాల కారణంగా ఈ మూవీ షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది.
అయితే వచ్చే ఏడాది నుంచి రాజకీయంగా మరింత బిజీ అయ్యే అవకాశం ఉన్న నేపధ్యంలో పవన్ కళ్యాణ్ ఈ రెండు నెలల్లోనే సినిమా షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నాడు. ఈ నేపధ్యంలోనే షూటింగ్ మళ్ళీ స్టార్ట్ చేశారు. ఈ షూటింగ్ లో పవన్ కళ్యాణ్ కి సంబందించిన కీలక యాక్షన్ ఘట్టాలని తెరకెక్కించబోతున్నారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి ప్రతినాయకుడుగా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ని క్రిష్ తీసుకొచ్చాడు.
అయితే సినిమా ఆలస్యం అవుతూ ఉండటంతో డేట్స్ క్లాస్ కావడం వలన అతను ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. అతని స్థానంలో బాబీ డియోల్ ని ఈ మూవీలో ప్రతినాయకుడి పాత్ర కోసం క్రిష్ ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తుంది. అయితే అఫీషియల్ గా ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఖరారు చేయలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ కి జోడీగా యువరాణి పాత్రలో కనిపించబోతుంది. అలాగే జాక్వలైన్ ఫెర్నాండేజ్ కూడా మరో హీరోయిన్ గా నటించాబోతుంది. ఇక నవంబర్ మొదటి వారం నుంచి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు రెగ్యులర్ షూటింగ్ లో జాయిన్ అవుతాడని తెలుస్తుంది.