Arjun Kapoor : ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహిస్తే అది జీవితం ఎలా అవుతుంది? మన స్టోరీ మనకి నచ్చినట్టు రాసుకున్నా.. స్క్రీన్‌ప్లే మాత్రం పైవాడు తనకు తోచినట్టే రాస్తాడు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ వ్యక్తుల విషయానికొస్తే.. చిత్ర విచిత్రాలన్నీ వారి జీవితాల్లోనే ఉంటాయి. సినిమాల్లో ట్విస్టులు ఉన్నట్టే వారి జీవితాల్లోనూ ఊహించని ట్విస్ట్‌లు చాలా ఉంటాయి. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. బాలీవుడ్ స్టార్ హీరో ఒకరు.. గతంలో ఒక హీరోయిన్ పెళ్లికి వెళ్లాడు. అది అతని చిన్నవయసులో అంటే అతనికి 13 ఏళ్లు ఉన్నాడు. ఇప్పుడు ఆమెతోనే ఆ హీరో డేటింగ్‌లో ఉండటం విశేషం.
అర్భాజ్ – మలైకాల పెళ్లికి అర్జున్ కపూర్ వెళ్లాడు. అది కూడా తన చిన్నతనంలో.. 1998లో మలైకా – అర్బాజ్‌ల మ్యారేజ్ జరిగింది. అప్పుడు అర్జున్ కపూర్ వయసు 13 ఏళ్లు.. ఆ పెళ్లిలో చక్కగా కూల్ డ్రింక్ తాగుతూ ఎంజాయ్ చేసాడు కూడా.. ఆ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పిల్లాడిగా ఉన్నప్పుడు మలైకా పెళ్లికి వెళ్లిన అర్జున్.. పెద్దయ్యాక ఆమెతోనే డేటింగ్ చేసేంత పెద్దవాడవుతాడని బహుశా అతను కూడా ఊహించి ఉండడు.. ఇద్దరి మధ్య 12 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉందని తెలుసు.. వీళ్లిద్దరూ ప్రేమకి వయసు అడ్డు కాదు.. రాదు.. అని ప్రూవ్ చేశారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Arjun Kapoor : మలైకా మాజీ భర్త, బాయ్ ఫ్రెండ్ ఇద్దరూ ఆ షోకి హాజరవుతారట..
మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. మలైకా అరోరా తన సోదరి అమృత అరోరాతో కలిసి చేస్తున్న ‘అరోరా సిస్టర్స్’ అనే రియాలిటీ షో లో మలైకా మాజీ భర్త అర్బాజ్ ఖాన్, బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ హాజరు కానున్నారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే కనుక ఆ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందోనంటూ బాలీవుడ్ మీడియా కథలు కథలుగా కథనాలు రాస్తోంది. ఇదిలా ఉంటే.. సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్‌ల విషయంలో కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి ఊహించని సంఘటన జరిగింది.. 1991లో సైఫ్, అమత సింగ్‌ను పెళ్లాడాడు. అప్పుడు 11 ఏళ్ల చిన్నారి కరీనా ఆ పెళ్లికి వెళ్లింది. దాదాపు 20 సంవత్సరాల తర్వాత అంటే 2012లో కరీనా, సైఫ్‌ని మ్యారేజ్ చేసుకుంది.