బిగ్ బాస్ షో శ్రీసత్యతో లవ్ ట్రాక్ నడుపుతూ అందరి దృష్టిలో పడే ప్రయత్నం చేస్తున్న కంటిస్టెంట్ అర్జున్ కళ్యాణ్. షోలో అతను ఆటతో కంటే శ్రీసత్యతో లవ్ ట్రాక్ తోనే ఎక్కువ చర్చల్లో ఉంటున్నాడు. ప్రతివారం కింగ్ నాగార్జున వచ్చి అతని ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న తాను మాత్రం ఏ విధంగా మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయడం లేదనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తుంది. శ్రీసత్య లవ్ ట్రాక్ కారణంగానే ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సిన వాడిని బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఇంకా హౌస్ లో ఉంచుతున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే అర్జున్ కళ్యాణ్ హౌస్ లో శ్రీసత్య ఎంతగా దూరం పెట్టిన ఆమెకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక హౌస్ లోకి వెళ్లడానికంటే ముందుగా ఈ కుర్ర హీరో ఒక హీరోయిన్ గా ప్రేమాయణం నడిపించాడు. కెరియర్ ఆరంభంలోనే తనతో కలిసి నటించిన హీరోయిన్ కి ఐ లవ్ యు చెప్పి ఆమెతో కొంతకాలం డేట్ లో కూడా ఉన్నాడు. ఈ విషయాన్ని సదరు హీరోయిన్ తాజాగా చెప్పింది. ఆమె తెలుగు యంగ్ హీరోయిన్ పూజిత పొన్నాడ. ఈ యంగ్ బ్యూటీ ఈ మధ్య సినిమాలు, వెబ్ సిరీస్ లలో అవకాశాలు అందుకుంటుంది.
ఇక ఈ భామ కెరియర్ ఆరంభంలో ఉన్న సమయంలో అర్జున్ కళ్యాణ్ తనకి ప్రపోజ్ చేసాడని చెప్పింది. నేను కూడా ఒకే చెప్పి కొంతకాలం డేట్ లో ఉన్నామని, అయితే తరువాత మా ఇద్దరికి సెట్ కాదని డిసైడ్ అయ్యి విడిపోయినట్లు చెప్పింది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అతనికి తన విషెస్ ఉంటుందని, ఇప్పటికి మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ గా ఉన్నామని పూజిత చెప్పుకొచ్చింది. ఈ యంగ్ హీరోయిన్ గతంలో దేవిశ్రీప్రసాద్ తో ప్రేమలో ఉందనే ప్రచారం టాలీవుడ్ సర్కిల్ లో వినిపించింది. రీసెంట్ గా ఆ విషయాన్ని ఆమె ఖండించింది.