bigg boss 6 : బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగు ఆరవ వారం మంచి జోష్‌తోనే ప్రారంభమైంది. తొలిరోజు నామినేషన్స్ హాట్ హాట్‌గా జరిగినా మలి రోజు మాత్రం కాస్త ఎమోషన్స్.. అలాగే హ్యాపీనెస్‌ల కలయికతో షో నడిచింది. ఇక ఈ రోజు కూడా షో కాస్త చిరు కోపాలతో పాటు మంచి హ్యాపీ మూడ్‌లోనే జరిగే అవకాశం కల్పిస్తోంది. నిన్నటి షో.. అటు ఆదిరెడ్డికి.. ఇటు సుదీపకు బాగా కలిసొచ్చింది. శ్రీహాన్‌కు కూడా ఇది ప్లస్సే అయ్యిందని చెప్పాలి.
నిన్నటి టాస్క్‌లో భాగంగా ఒక మూడు ఆప్షన్స్ ఇచ్చి.. ఈ ఆప్షన్స్‌లో ఒకటి ఎంచుకోవాలని.. ఎంచుకున్న దాన్ని బట్టి మీ బ్యాటరీ డిశ్చార్జ్ అయ్యే పర్సంటేజ్ ఆధారపడి ఉంటుందని బిగ్‌బాస్ చెప్పారు.సుదీప తన భర్త నుంచి ఫోన్ కాల్ ఎంచుకుంది.ఆదిరెడ్డి తన భార్య, కూతురు నుంచి వీడియో కాల్ ఎంచుకున్నాడు. శ్రీహాన్ బ్యాటరీ చార్జింగ్ చాలా తక్కువగా ఉన్న కారణంగా ఫుడ్ ఎంచుకున్నాడు.ఇక ఈ రోజు కూడా ఈ టాస్క్ కొనసాగింది. ఇవాళ కన్ఫెషన్ రూమ్‌లోకి అర్జున్‌ని పిలిచాడు బిగ్‌బాస్.
అర్జున్.. ఎంత వద్దు బాబోయ్.. తనకలాంటి ఫీలింగ్స్ లేవని నెత్తి నోరు మొత్తుకుంటున్నా ఆమె చుట్టే తిరిగాడు. ఇక మొన్న ఆమె కచ్చితంగా చెప్పేసింది. తనకు తన ఫ్యామిలీ తప్ప వేరొకరు కనిపించరని.. వేరొకరి గురించి అసలు ఆలోచించని.. అంతా వినేసి ఇక తను కూడా ఆమె చుట్టూ తిరగనని చెప్పేశాడు. నాగ్ దగ్గర కూడా శ్రీ సత్యకు అనుకూలంగా ఏమీ మాట్లాడలేదు. ఇక నేటి ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది. ఆ ప్రోమోలో మనోడు తిరిగి నీకు కావల్సిన ఆప్షన్స్ ఎంచుకోమని బిగ్‌బాస్ చెబితే.. శ్రీ సత్య వాళ్ల అమ్మ కాల్ కోసం ఎదురు చూస్తోందని తన ఆప్షన్స్ అన్నీ తనకు కన్వర్ట్ చేయవచ్చా? అని అడిగి షాకిచ్చాడు. మనోడు బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లే వరకూ ఈ శ్రీ సత్య జపం వదిలేలా లేడు.