Biggboss 6 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 ఇప్పుడిప్పుడే ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ కాస్త పెరిగింది. నామినేషన్, ఎలిమినేషన్, కెప్టెన్సీ లాంటి విషయాల కంటే కూడా వేరే కొన్ని విషయాలు ఇంట్రస్టింగ్‌గా మారాయి. వాటిలో ముఖ్యమైనది శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్ ఇష్యూనే. వారిద్దరి మధ్య ఏదో జరుగుతుందని ఇంటా.. బయటా టాక్. ఇటీవలే హౌస్‌లో జరిగిన కొన్ని సన్నివేశాలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. హౌస్ లో రేవంత్ అర్జున్ కల్యాణ్ వద్దకు వెళ్లి.. శ్రీ సత్య- వాసంతి చెల్లెళ్లు అని చెప్తే.. వాసంతిని మాత్రం చెల్లిగా ఒప్పుకున్నాడు కానీ.. శ్రీ సత్యను మాత్రం చెల్లిగా అంగీకరించలేదు. దీంతో సత్య, అర్జున్ మధ్య ఏదో జరుగుతోందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఆ విషయాన్ని బయటపెట్టే ప్రయత్నం చేశాడు బిగ్ బాస్.
నేడు బిగ్‌బాస్ హౌస్‌లోకి మిల్కీబ్యూటీ తమన్నా వెళ్లింది. ఈ అమ్మడు నటించిన బబ్లీ బౌన్సర్ సినిమా త్వరలో ప్రేక్షకు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బిగ్ బాస్ ఇంట్లోకి మిల్కీ బ్యూటీ అడుగుపెట్టింది. ఇంట్లోని సభ్యుల కోసం ‘తమన్నా కానుక’ పేరుతో ఓ గిప్ట్ హ్యాంపర్‌ను హౌస్ లోకి తీసుకెళ్లింది. ఇందుకు సంబంధించిన ప్రోమో కొద్ది సేపటి క్రితం విడుదలైంది. బిగ్ బాస్ హౌస్‌లోని మగవారికి నాగార్జున ఓ ఆఫర్ ఇచ్చారు. “ఇక్కడ ఉన్న ప్రతి అబ్బాయి.. హౌస్‌లో ఉన్న ఒకమ్మాయిని తమ బౌన్సర్ గా ఎంచుకోవచ్చు” అని చెప్పారు. చంటి.. తనకి బౌన్సర్‌గా ఫైమాను ఎంచుకుని బ్యాండేజ్ తొడిగాడు. అలా మిగిలిన అబ్బాయిలు కూడా తమకు నచ్చిన వారిని ఔన్సర్ గా ఎంచుకున్నారు.
Biggboss 6 : బౌన్సర్‌గా శ్రీ సత్యను ఎంచుకున్న అర్జున్
ఈ క్రమంలో అర్జున్ కల్యాణ్.. తన బౌన్సర్ గా శ్రీ సత్యను ఎంచుకున్నాడు. అర్జున్.. సత్య పేరు చెప్పగానే బయట ఉన్న ఆడియెన్స్ అరిచారు. అంతే కాక ఒక ప్రేక్షకురాలు వారి మధ్య ఏదో ఉందని చెప్పింది. దానికి నాగార్జున.. అర్జున్ విషయంలోనా? అని అడిగారు. దానికి అర్జున్ అదో రకంగా ముఖం పెట్టాడు. దానికి వెనుక ఉన్న మిగతా కంటెస్టెంట్లు ‘కమల్ హాసన్’ అని అంటూ కామెంట్స్ చేశారు. ఆమె నాకు మంచి ఫ్రెండ్ సరే.. అంతే అని అర్జున్ అన్నాడు. తమన్నా మాట్లాడుతూ.. ‘మేం ఎన్ని సినిమాల్లో నటించాం.. అందులో అన్నీ ఫ్రెండ్ షిప్ తోనే మొదలవుతాయి’ అని చెప్పింది. 100% లవ్ లో కూడా హీరోహీరోయిన్లు బాగా కొట్టకున్నారు కదా, అందులో మహాలక్ష్మి క్యారెక్టర్‌కి చికెన్ అంటే చాలా ఇష్టం కదా అన్నారు నాగార్జున. మొత్తానికి ఆడియన్స్ అన్న మాటలకు బలం చేకూరింది.