బిగ్ బాస్ సీజన్ 6 ప్రస్తుతం రసవత్తరంగా సాగుతుంది. మొదటి రెండు వారాలు అంత పసలేకుండా సాగిన షో ఇప్పుడు మాత్రం మెల్లమెల్లగా ఆడియన్స్ ఆదరణని సొంతం చేసుకుంది. బలమైన కంటిస్టెంట్ లు ఉండటంతో హౌస్ లో పోటీ కూడా ఎక్కువ అయ్యింది. అలాగే మిగిలిన సీజన్స్ తో పోల్చుకుంటే ఈ సారి అంచనాలకి అందకుండా ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతుంది. అందరూ అనుకుంటున్నది ఒకరిని అయితే ఫైనల్ గా ఎలిమినేషన్ తో బయటకి వచ్చేది మరొకరు అవుతున్నారు. హౌస్ లోకి వెళ్లేముందు బలమైన కంటిస్టెంట్ లు అనుకున్న అభినయశ్రీ, ఎంటర్టైనర్ అనుకున్న షాని సోలొమన్ అందరికంటే ముందుగానే బయటకి వచ్చేశారు.
టాప్ 5 లో ఒకరిగా అందరూ భావించిన నేహా చౌదరి మూడో ఎలిమినేషన్ గా హౌస్ నుంచి బయటకి వచ్చి అందరికి షాక్ ఇచ్చింది. బయటకి వచ్చిన ముగ్గురు కూడా ఎలిమినేషన్ ఫెయిర్ గా జరగలేదని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఐదో వారంలో నాలుగో ఎలిమినేషన్ గా డేంజర్ జోన్ లో అర్జున్ కళ్యాణ్, సుదీప్ ఉన్నారని వారిద్దరిలో ఒకరు బయటకి వచ్చేస్తారని అందరూ భావించారు. అయితే అందుకు విరుద్ధంగా ప్రతి వారం తనని తాను మెరుగుపరుచుకుంటూ బలమైన కంటిస్టెంట్ గా పోటీలో నిలిచే ప్రయత్నం చేస్తున్న ఆరోహిరావు ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది. అందరి అంచనాలకి విరుద్ధంగా ఆమె హౌస్ నుంచి బయటకి వచ్చిందనే టాక్ వినిపిస్తుంది.
ఆరోహిరావు పెర్ఫార్మెన్స్ పరంగా చాలా మంది కంటే మెరుగ్గానే కంటెంట్ ఇస్తుంది. అలాగే సూర్యతో రొమాన్స్ ట్రాక్ నడుపుతూ ఆడియన్స్ కి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కూడా బాగానే అందిస్తుంది. అయితే ఊహించని విధంగా హోస్ట్ నాగార్జున ఫైనల్ గా ఆమెని ఎలిమినేట్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. అర్జున్ కళ్యాణ్ రెండు సార్లు వరస్ట్ పెర్ఫార్మర్ గా హౌస్ లో అందరితో అనిపించుకుని జైలుకి వెళ్ళాడు. అలాగే అతను శ్రీసత్య చుట్టూ తిరగడం తప్ప కంటెంట్ కూడా పెద్దగా ఇవ్వడం లేదు. గేమ్స్ లో కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ లేదు. అయినా అతను సేవ్ అయ్యి ఆరోహి రావు ఎలిమినేట్ కావడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మరి బయటకి వచ్చాక ఆరోహి తన ఎలిమినేషన్ పై ఎలా రియాక్ట్ అవుతుందనేది చూడాలి.