Apsara Rani : అందాల ఆరబోతలో ఒకప్పుడు బాలీవుడ్ భామలే టాప్ ప్లేస్‌లో ఉండేవారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ భామలు తమ సరిహద్దులను చెరుపుతూ స్కిన్ షో చేస్తూ వీర లెవెల్‌లో రెచ్చిపోతున్నారు. వర్థమాన నటి అప్సర రాణి ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా బికినీతో యూత్‌కు చెమటలు పట్టిస్తోంది.

Apsara Rani : హాట్ అండ్ గ్లామర్ లుక్స్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అప్సరా రాణి. 2019లో 4 లెటర్స్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ చిన్నది. ఆ తరువాత కొన్ని సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. డేరింగ్ అండ్ డ్యాషింగ్ దర్శకుడు రాంగోపాల్ చేతిలో పడ్డాక అమ్మడి క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. రామ్‌గోపాల్ దర్శకత్వంలో వచ్చిన థ్రిల్లర్ సినిమాలో నటించిన తరువాత అప్సర రాణికి నటిగా గుర్తింపు లభించింది. రీసెంట్‌గా రవితేజ సినిమా క్రాక్‌లో ఐటెం సాంగ్‌లో ఫుల్ లెన్త్ గ్లామర్ షో చేసి కుర్రాళ్లకు బాగా కనెక్ట్ అయ్యింది. డీ కంపెనీ, సీటీమార్, మా ఇష్టం సినిమాల్లో నటించినా అమ్మడికి మాత్రం ఇంకా దశ తిరగలేదు.

ఇదంతా పక్కన పెడితే అమ్మడికి సినిమాలు పెద్దగా లేకపోయినా ఫ్యాన్స్ ఫాలోయింగ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే . సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చేసే హంగామా మామూలుగా ఉండదు. ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలను ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ వెకేషన్ మూడ్‌లో ఉంది. పూల్ పార్టీనీ ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది.

పూల్ పార్టీ కోసం అప్సర రాణి వేసుకున్న బికినీ ఇప్పుడు ఇంటర్నెట్‌లో మంటలు రేపుతోంది. డార్క్ రెడ్ కలర్ టూ పీస్ బికినీలో తన అందాలను చూపించీ చూపించకుండా కుర్రాళ్లను చంపేస్తోంది. కైపెక్కించే చూపులతో నిషా ఎక్కించే నవ్వుతో ఒంపు సొంపులను వయ్యారంగా తిప్పుతూ బీచ్ లో దిగిన హాట్ ఫోటో షూట్ పిక్స్ ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి బోల్డ్ లుక్స్ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఈ ఫోటోలకు జతగా అప్సరా యంగ్ వైల్డ్ అండ్ ఫ్రీ అని క్యాప్షన్‌ను జోడించింది. ఈ హాట్ పిక్స్ చూసిన రామ్ గోపాల్ వర్మ క్రేజీ కామెంట్‌ను పోస్ట్ చేశాడు. యంగ్ వైల్డ్ అండ్ నాట్ ఫ్రీ , కానీ అత్యంత విలువైన వజ్రం నువ్వని మెన్షన్ చేశాడు. రామ్ గోపాల్ వర్మ కామెంట్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అందాల ఆరబోత అప్సరసకు కొత్తేమి కాదు గతంలోనూ టూ పీస్ బికినీలతో ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. బోల్డ్ లుక్స్‌తో తన షేప్స్ పర్ఫెక్ట్‌గా కనిపించేలా చేసిన ఫోటోలూ నెట్టింట్లో ఇంకా సందడి చేస్తూనే ఉన్నాయి.

గతంలో ఇన్నర్ వేసుకోకుండా షర్ట్ కు బటన్స్ పెట్టకుండా ఓపెన్ షర్ట్ లో చేసిన ఫోటో షూట్ పిక్స్ సోషల్ మీడియాలో సునామీని సృష్టించాయి. టాలీవుడ్ భామలు ఎక్స్‌పోజింగ్‌లో ఏమాత్రం తగ్గేదేలే అని నిరూపించింది అప్సర.
