Apricot: ఆప్రికాట్ పండు గురించి తెలుసా అంటే తెలియదనే చాలా మంది చెబుతారు. ఎందుకంటే దీని గురించి ఎవరూ ఎక్కువగా విని ఉండరు. అలాగే తినుండరు కూడా. ఆప్రికాట్ ను సీమ బాదం అని, ఖుర్బానీ పండు అని కూడా పిలుస్తారు. ఇది తీపి, వగరు రుచులతో భిన్నంగా ఉంటుంది. అయితే ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి. కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ ఏ, ఐరన్ తోపాటు విటమిన్ సీ కూడా ఇందులో సమృద్ధిగా ఉంటాయి.
ఆప్రికాట్ పండును తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. శరీరంలో పెరిగి మనల్ని ఇబ్బంది పెట్టే కొవ్వును తగ్గించడంలో ఆప్రికాట్ అద్భుతంగా పని చేస్తుంది. వీటిలో అధిక ఫైబర్ తోపాటు లాక్సేటివ్ గుణాలు ఉంటాయి. ఈ లాక్సేటివ్ గుణాలు మలబద్దకం సమస్యలను దూరం చేస్తాయి.
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది
ఆప్రికాట్ లో మెండుగా ఉండే విటమిన్ ఏ.. కంటి సమస్యలు రాకుండా చూస్తుంది. వీటిలో ఇనుము సమృద్ధిగా ఉండి అనీమియా రాకుండా కాపాడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఇది ఎంతో దోహదపడుతుంది. ఎముకల ఆరోగ్యానికి కావాల్సిన ఖనిజాలు ఆప్రికాట్ లో మెండుగా ఉంటాయి. వీటిలో ఉండే ఏ, సీ విటమిన్లు, ఫైటోన్యూట్రియంట్స్.. చర్మాన్ని ఆరోగ్యంగా, మృదువుగా ఉంచడంలో తోడ్పడతాయి.
Apricot: బరువు పెరగకుండా కాపాడుతుంది
క్యాన్సర్లను నివారించే కెరోటినాయిడ్స్ తోపాటు ఇతర యాంటీ ఆక్సిడెంట్స్ ఆప్రికాట్ లో పుష్కలంగా ఉంటాయి. ఆప్రికాట్ తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది. అందువల్ల శరీరం బరువు పెరగకుండా కాపాడుతుంది. దీనిలో అధికంగా ఉండే పీచు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఆప్రికాట్ పండు కాలేయంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించడంలో ఉపయోగపడుతుంది. ఫ్యాటీ లివర్ వ్యాధి రాకుండా ఇది కాపాడుతుంది. దీంతో ఉబ్బసం, జలుబు, ఫ్లూ లక్షణాలు ఉన్నవారికి ఉపశమనం కలిగిస్తుంది. కండరాలకు అవసరమైన శక్తిని అందజేయడంలోనూ ఈ పండు దోహదపడుతుంది.