పఠాన్ తర్వాత, షారుఖ్ ఖాన్ అట్లీ యొక్క జవాన్‌తో తిరిగి వస్తారని భావిస్తున్నారు, సౌత్ సెన్సేషన్ నయనతారతో జతకట్టాడు. చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం, సెట్ నుండి లీక్ అయిన ఫోటోలు మరియు వీడియోల కారణంగా తరచుగా ముఖ్యాంశాలు చేస్తుంది. విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ అతిధి పాత్ర కోసం గతంలో వార్తల్లో నిలిచింది. ఇంతకుముందు, పుష్ప స్టార్ అల్లు అర్జున్ అతిధి పాత్ర కోసం జవాన్‌లోకి ప్రవేశించే అవకాశం ఉందని సోషల్ మీడియా లో వార్తలు వచ్చాయి . కానీ అది నిజం కాదనిపిస్తోంది.

జవాన్ మూవీ
‘జవాన్’ లో అతిథి పాత్ర కోసం అసలు బన్నీని ఎప్పుడూ సంప్రదించలేదని బాలీవుడ్ మీడియాలో నివేదికలు పేర్కొన్నాయి. షారుక్ ఖాన్ మూవీలో అల్లు అర్జున్ కనిపిస్తాడనేది కేవలం రూమర్ మాత్రమే, నిజానికి అతిధి పాత్ర కోసం అతన్ని సంప్రదించలేదని చెబుతున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాలో సీనియర్ నటుడు సంజయ్ దత్ మాత్రమే గెస్ట్ రోల్ లో కనిపిస్తారని వార్తలు వస్తున్నాయి.
ఇటీవల అల్లు అర్జున్ ఫ్రెండ్, నిర్మాత బన్నీ వాసు సైతం ఇదే విషయం మీద స్పందించారు. ‘జవాన్’ సినిమాలో అల్లు అర్జున్ నటించడం లేదని తెలిపారు. కాకపొతే బాలీవుడ్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయని.. ఇటీవల ‘ది ఇమ్మోర్టల్ ఆఫ్ అశ్వత్థామ’ యూనిట్ సంప్రదించినట్లుగా వెల్లడించారు. అయితే వాళ్లకు ఇంకా ఓకే చెప్పలేదని, కానీ బన్నీ ఈ సినిమా చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు చెప్పారు.