Harish Rao: తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పైన విమర్శలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అలాగే స్టీల్ ప్లాంట్ సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం బిడ్ వేసి కొనుగోలు చేస్తుందని హరీష్ రావు అన్నారు. తెలంగాణలో సెటిల్ అయినా ఆంధ్రప్రదేశ్ కార్మికులందరూ కూడా తమ ఓటు హక్కును మార్చుకోవాలనే సలహా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో ఎలాగూ అభివృద్ధి లేదు కాబట్టి కెసిఆర్ సర్కార్ మీకు అండగా ఉంటుందంటూ హరీష్ రావు హామీ ఇచ్చారు. ఇక హరీష్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు ఒకరి తర్వాత ఒకరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కారుమూరి నాగేశ్వరరావు హరీష్ రావుపై సీరియస్ అయ్యారు.
ముందు మీ ప్రాంతం అభివృద్ధి గురించి దృష్టి పెట్టండి. ఏపీ అభివృద్ధితో పోటీపడే స్థాయిలో తెలంగాణ లేదంటూ విమర్శలు చేశారు. దీనిపై హరీష్ రావు తిరిగి రియాక్ట్ అయ్యి అభివృద్ధిలో ఏపీకి తెలంగాణకి చాలా తేడా ఉందంటూ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ దగ్గరకు కూడా ఏపీ రాలేదని విమర్శించారు. వీటిపై మరల ఏపీ మంత్రులు సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. ఏపీ అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు హరీష్ రావుకు లేదంటూ బొత్స సత్యనారాయణ విమర్శలు చేశారు.
తాజాగా మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మరింత ఘాటుగా విమర్శలు చేయడం. ప్రాంతీయ ఉగ్రవాదాన్ని ఎగదోసి మీరు తెలంగాణ నాయకులయ్యారంటూ సీదిరి అప్పలరాజు సంచలన విమర్శలు చేశారు. హరీష్ రావు కల్లు తాగిన కోతులా ఎగిరిపడుతున్నాడు అంటూ సీదిరి అప్పలరాజు విమర్శలు చేశారు. ముందు మీ రాష్ట్రం గురించి మీరు చూసుకుంటే మంచిది అంటూ ఘాటుగా స్పందించారు. కాస్తా వివాదాస్పదంగా తెలంగాణ ఉద్యమాన్ని అవమానించే విధంగా సీదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. దీనిపై ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది.