AP Assembly: ఏపీ అసెంబ్లీలో హైటెన్షన్ నెలకొంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చుతూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై టీడీపీ ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు ఎలా మారుస్తారంటూ అసెంబ్లీలో ఆందోళను దిగారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నిరసన చేశారు. స్పీకర్ తమ్మినేని సీతారాంపై పేపర్లు చింపి విసిరేశారు. స్పీకర్ కకు రక్షణగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పోడియం దగ్గరకు చొచ్చుకోచ్చారు. టీడీపీ సభ్యలతో వాగ్వాదానికి దిగారు. కాసేపు టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య స్పీకర్ పోడియం వేదికగా తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు వ్యక్తిగతంపై విమర్శలు చేసుకున్నారు.
ఈ క్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూర్చీలోనుంచి పైకి లేచి టీడీపీ సభ్యులపై సీరియస్ అయ్యారు. ఇయర్ ఫోన్స్ ను తీసివేసిర విసురుగా టేబుల్ మీద పెట్టారు. సంయమనం పాటించిన స్పీకర్ తమ్మినేని.. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు. టీడీపీ, వైసీపీ సభ్యుల వాగ్వాదం, టీడీపీ సబ్యులు పోడియంను చుట్టుముట్టి పేపర్లు విసిరేయడంతో సభలో హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకకుంది. ఇక అటు శాసనమండలిలో కూడా టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చవద్దంటూ నినాదులు చేశారు.
ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా ఎన్టీఆర్ వర్సిటీని ఎన్టీఆర్ ప్రారంభించారని, ఎన్టీఆర్ సేవలకు గుర్తుగా పేరు పెడితే మార్చడమేంటి అని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. టీడీపీ అధికరాంలోకి వచ్చాక జగన్ ప్రభుత్వం పెట్టిన పేర్లు అన్నీ మార్చితే ఏం చేస్తారు అని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ప్రశ్నించారు. ఇక పాలనలో మార్పు తేలేక పేర్ల మార్పు తెలుస్తున్నారని మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి పేరు మార్చడం ప్రతీకార చర్య అని ఆయన ఆరోపించారు.
AP Assembly:
పాత పథకాలకు పేర్లు మార్చి కొత్త పథకాలుగా చెప్పుకుంటున్నారని జవహర్ విమర్శించారు. తండ్రీకొడుకులది ఒకే పాలన.. పేర్లు మార్చడం తప్ప చేసిందేమీ లేదని జవహర్ తీవ్ర విమర్శలు చేశారు. ఇక మాజీ మంత్రి దేవినేని ఉమా ఈ అంశంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు దుర్మార్గమని, గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధికి తమ స్టిక్కర్లు వేస్తున్నారని, స్టిక్కర్ సీఎంగా జగన్ మిగిలిపోతారని విమర్శించారు. వర్సిటికి ఎన్టీఆర్ పే అర్ధరాత్రి ఆన్ లైన్ ఆమోదాలతో తొలగించాలన్న జగన్ రెడ్డి నియంతృత్వ పోకడలకు ప్రజలు బుద్దిచెప్తారని దేవినేని ఉమా విమర్శించారు.