నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో ప్రసారం అయినా అన్ స్టాపబుల్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇక ఈ షోకి ఊహించని స్థాయిలో క్రేజ్ వచ్చింది. బాలయ్య బాబు తనదైన శైలిలో హోస్ట్ గా గెస్ట్ గా వచ్చే సెలబ్రెటీలని ప్రశ్నలు వేయడంతో పాటు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేశారు. ఇక ఈ అన్ స్టాపబుల్ మొదటి సీజన్ పూర్తయ్యింది. ఇక రెండో సీజన్ త్వరలో ప్రారంభం అవుతుందని ఇప్పటికే ప్రోమో ద్వారా ప్రకటించారు. దీంతో సీజన్ 2పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అయితే ఈ సీజన్ 2 మొదటి ఎపిసోడ్ ఎవరితో స్టార్ట్ అవుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా దసరా సమయంలో సీజన్ 2 మొదటి ఎపిసోడ్ ని ప్రసారం చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక మెగాస్టార్ చిరంజీవితో బాలయ్య బాబు మొదటి ఎపిసోడ్ ఉంటుందనే ప్రచారం ఇప్పటికే వినిపిస్తుంది. అయితే ఒక వేళ షో ప్రారంభం కావడం ఆలస్యం అయితే మరో గెస్ట్ ని తీసుకురావడానికి అల్లు అరవింద్ ప్రయత్నం చేస్తున్నారు. ఆమె బాహుబలి దేవసేన అనుష్క శెట్టిని తీసుకురావాలని అనుకుంటున్నారు. బాహుబలి సినిమా తర్వాత ఆమె ఇప్పటి వరకు మీడియా ముందుకి రాలేదు. అలాగే అనుష్క సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండదనే సంగతి తెలిసిందే.
ఎప్పుడో రేర్ గా సోషల్ మీడియాలో ఆమె పోస్టులు పెడుతుంది. అందరి హీరోయిన్స్ తరహాలో అందాల ఫోటోలని కూడా పెట్టదు. ఇక ఎక్కువ ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడుతుంది. కనీసం సినిమా సర్కిల్ లో కూడా కనిపించలేదు. రీసెంట్ గా కృష్ణంరాజు మరణం సమయంలో మాత్రమే మీడియాకి చిక్కింది. ఇదిలా ఉంటే అన్ స్టాపబుల్ సీజన్ 2లో మొదటి ఎపిసోడ్ కోసం మెగాస్టార్ చిరంజీవి కాకుంటే అనుష్క శెట్టిని కచ్చితంగా తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అనుష్క ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ లో నవీన్ పోలిశెట్టికి జోడీగా ఓ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాకి సంబందించిన విశేషాలు కూడా ఆమె రాక ద్వారా తెలిసే అవకాశం ఉందని చెప్పాలి.