Anushka Sharma : బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ తన స్టైలిష్ లుక్స్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. సీ త్రూ ఆకుపచ్చని చీరప్లంగింగ్ కట్టుకుని తన సొగసులతో మెస్మరైజ్ చేస్తోంది. ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ఫ్యాషన్ లేబుల్ నుంచి ఈ అందమైన చీరను ఎన్నుకుని అందరి చూపును తనవైపు తిప్పుకుంది ఈ చిన్నది. ట్రెడిషనల్ వేర్‌కి సెక్సీ టచ్ ఇచ్చి నెట్టింట్లో ట్రాఫిక్ జామ్ చేస్తోంది. తన ఎత్నిక్ లుక్‌తో క్రికెటర్ హబ్బీ విరాట్ కొహ్లీ హార్ట్ ను మరోసారి దోచేసింది.

Anushka Sharma : అనుష్క షర్మ సోషల్ మీడియాలో తక్కువగానే కనిపిస్తుంది. ఏదైనా స్పెషల్ అకేషన్‌లు లేదా ఫ్యాన్స్‌కి ఏమైన చెప్పాలనుకుంటే తప్పా పెద్దగా హడావిడి కనిపించదు. రీసెంట్‌గా భర్త్ విక్టరీకి సంబంధించిన పిక్స్‌ను పోస్ట్ చేసి ఫ్యాన్స్‌ను ఖుషీ చేసిన అనుష్క తాజాగా పండుగ వేళ తన ఎత్నిక్ లుక్స్‌ను షేర్ చేసి అందరిని మంత్రముగ్ధులను చేసింది. ఆకుపచ్చని చీరకట్టుతో దిగిన అందమైన పిక్స్‌ను వరుసపెట్టి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి సందడి చేసింది. ఈ అందమైన సీ త్రూ చీరకు మ్యాచింగ్‌గా సీక్విన్స్ అలంకరణలతో వచ్చిన ప్లంగింగ్ నెక్‌తో డిజైన్ చేసిన స్ట్రాపీ గ్రీన్ బ్లింగ్ బ్లౌజ్‌ను వేసుకుని ఎంతో హాట్ గా కనిపించింది.

ఆరు గజాల చీరను ఎంతో అద్భుతంగా డిజైన్ చేశారు డిజైనర్. చీరంతా రఫెల్స్, పోల్కా డాట్స్‌తో మోడ్రన్ టచ్ ఇచ్చేలా రీఫ్రెషింగ్ షేడ్ తో డిజైన్ చేశారు. ఈ చీర అనుష్కకు పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యింది. అమ్మడి అందాలు అదుర్స్ అనిపించాయి. తన కురులతో సైడ్ పాపిట తీసుకుని లూజ్‌గా వదులుకుని హాట్ లుక్స్‌తో అదరగొట్టింది. ఇక మెడలో విలువైన రాళ్లతో పొదిగిన స్టేట్మెంట్ జ్యువెల్లరీని వేసుకుని అందరి చూపును తనవైపు తిప్పుకుంది అనుష్క.
పెదాలకు పింక్ లిప్‌స్టిక్ పెట్టుకుని బుగ్గలకు రోజీ బ్లష్ చేసుకుని కనుబొమ్మలను ఫిల్ చేసుకుంది. సింపుల్ మేకప్‌తో ఎంతో సెక్సీగా కనిపించింది అనుష్క. ఈ లుక్‌లో ఉన్న అనుష్క పిక్‌కు విరాట్ హార్ట సింబల్స్‌ను ఇన్‌బాక్స్‌లో పోస్ట్ చేశాడు. ఫిల్మ్ మేకర్ కరణ్ జోహర కూడా గార్జియస్ అంటూ పొగడ్తలతో ముంచేశాడు.

అనుష్క కట్టుకున్న చీర, జ్యువెల్లరీ క్రెడిట్ అంతా కూడా ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ ఫ్యాషన్ లేబుల్‌కే చెందుతుంది. సబ్యసాచి హై ఎండ్ లగ్జీరీ దుస్తులను రూపొందించడంలో పేరుగాంచింది. క్లాసికల్ వర్స్క్‌తో ఫ్యాషన్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది ఈ బ్రాండ్. బాంధని, గోటా వర్క్, బ్లాక్ ప్రింట్స్, హ్యాండ్ డైయింగ్‌లో పక్కా స్పెషలిస్ట్. బ్రైడల్ వేర్‌కు సంబంధించి మోడ్రన్ దుస్తులను రూపొందిస్తూ ఫ్యాషన్ ప్రియుల మనసు దోచేస్తోంది. ఈ డిజైనర్ రూపొందించిన దుస్తులనే ధరించి అదరగొట్టింది అనుష్క. ఫ్యాషన్ స్టైలిస్ట్ ఆలియా అల్ రుఫాయ్ అనుష్కకు స్టైలిష్ లుక్స్‌ను అందించాడు.
