Anushka: టాలీవుడ్ ఇండస్ట్రీకి సూపర్ సినిమా ద్వారా పరిచయమయి మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనుష్క అనంతరం పలు ప్రేమకథా చిత్రాలలో నటిస్తూనే మరోవైపు లేడి ఓరియెంటెడ్ సినిమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇకపోతే ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు ప్రభాస్ తో కలిసి సినిమాలలో నటించారు.
వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో అభిమానులు సైతం వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని పెళ్లి చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది అంటూ కామెంట్ లు చేశారు.ఇలా వీరిద్దరి గురించి ఎన్నో వార్తలు షికార్లు చేయడంతో ఈ వార్తలపై స్పందించిన అనుష్క ప్రభాస్ వారిద్దరు కేవలం మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని ఇద్దరి మధ్య ఏ విధమైనటువంటి రిలేషన్ లేదంటూ కొట్టి పారేశారు.
ఈ విధంగా వారి మధ్య ఉన్న రిలేషన్ క్లారిటీ ఇవ్వడంతో అప్పటినుంచి వీరి గురించి వచ్చే గాసిప్పులు పూర్తిగా తగ్గిపోయాయి. అయితే తాజాగా అనుష్క చేసిన పని వల్ల మరోసారి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.ఆదివారం తెల్లవారుజామున ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు అనారోగ్య సమస్యలతో ఏఐజీ ఆసుపత్రిలో మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. ఇలా కృష్ణంరాజు చనిపోయారన్న వార్త తెలియగానే ఎంతోమంది సినీ ప్రముఖులు కృష్ణంరాజు ఇంటికి వెళ్లి ఆయనకు నివాళులు అర్పించారు.
Anushka: మరోసారి వార్తల్లో నిలిచిన అనుష్క, ప్రభాస్..
ఈ విషయం తెలిసిన అనుష్క ఏకంగా ప్రభాస్ తల్లితో కలిసి ఏఐజి ఆసుపత్రికి వెళ్లారు.ఇలా హాస్పిటల్ కి వెళ్లిన కృష్ణంరాజు గారి పార్థివ దేహం చూడటంతో మరోసారి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని ఆ ప్రేమ వల్లే అనుష్క ఎంతో ఎమోషనల్ అవుతూ ఏకంగా హాస్పిటల్ కి వెళ్ళారంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి.ఇక అనుష్క హాస్పిటల్ కి వెళ్లి ఆయనని చూసినటువంటి వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఈ వార్తలకు బలం చేకూరాయి.