సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్న చిత్రం డీజే టిల్లు. లో బడ్జెట్ తో తెరకెక్కి అద్భుతమైన కలెక్షన్స్ సొంతం చేసుకున్న ఈ మూవీకి సీక్వెల్ ని ప్రస్తుతం తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈ మూవీకి టైటిల్ గా డీజే స్క్వేర్ అని ఫిక్స్ చేశారు. ఇక సినిమాని స్పెషల్ గా ఓపెన్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ముందుగా హీరోయిన్స్ పాత్ర కోసం శ్రీలీలని ఫైనల్ చేశారు. అయితే రెమ్యునరేషన్ విషయంలో ఆమెతో క్లాష్ రావడంతో శ్రీలీల స్థానంలో అనుపమ పరమేశ్వరన్ వచ్చి చేరింది. నిర్మాత కూడా ఆమెని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు.
అయితే ఇప్పుడు సడెన్ గా డీజే స్క్వేర్ మూవీ నుంచి అనుపమ పరమేశ్వరన్ తప్పుకుందని ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ మూవీలో కథ ప్రకారం కొన్ని ఇంటిమేట్ సన్నివేశాలు, బోల్డ్, కిస్సింగ్ సన్నివేశాలలో అనుపమ పరమేశ్వరన్ నటించాల్సిన అవసరం ఉంది. అయితే ఆ సీన్స్ అవసరానికి మించి ఉన్నాయనే ఉద్దేశ్యంతో అనుపమ అభ్యంతరం చెప్పిందని టాక్.
అయితే కథలో మార్పులు చేసేందుకు సిద్ధూ, దర్శకుడు మల్లిక్ సిద్ధంగా లేకపోవడం అనుపమ పరమేశ్వరన్ సినిమాని వాకౌట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో అనుపమ స్థానంలో డీజే స్క్వేర్ కోసం మరో హీరోయిన్ ని ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది. వీలైతే కొత్త హీరోయిన్ తో వెళ్లాలని సిద్ధూ ఆలోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. అనుపమ స్థానంలో మరో మలయాళీ బ్యూటీ మడోన్నా సబాస్టియాన్ హీరోయిన్ గా ఖరారు అయ్యిందనే టాక్ వినిపిస్తుంది.