జాతిరత్నాలు సినిమాతో సూపర్ సక్సెస్ కొట్టిన అనుదీప్ కెవి తాజాగా ప్రిన్స్ మూవీతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. శివ కార్తికేయన్ కి ఈ మూవీతో హ్యాట్రిక్ హిట్ వచ్చింది. ఇక అనుదీప్ కెవి కూడా తనకి అలవాటైన కామెడీ జోనర్ తో మరోసారి మెప్పించాడనే క్రెడిట్ ని సొంతం చేసుకున్నాడు. ఈ కుర్ర దర్శకుడికి భారీ నిర్మాణ సంస్థలు ఏకంగా అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో అనుదీప్ నెక్స్ట్ సినిమా చేయాల్సి ఉంది. ప్రిన్స్ హిట్ కావడంతో నెక్స్ట్ సినిమా కోసం అప్పుడే హీరోని కూడా అనుదీప్ ఎంపిక చేసుకున్నాడు. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో తన నెక్స్ట్ సినిమా ఉండే అవకాశం ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు.
త్వరలో అతన్ని కలిసి స్టోరీ చెప్పబోతున్నట్లుగా చెప్పాడు. ఈ ప్రాజెక్ట్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లోనే తెరకెక్కే అవకాశం ఉందని టాక్. అలాగే సురేష్ ప్రొడక్షన్ లోనే మరో మూవీకి అనుదీప్ కమిట్ అయ్యాడు. ఏకంగా విక్టరీ వెంకటేష్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ సురేష్ బాబు ఇచ్చినట్లు తెలుస్తుంది. వెంకటేష్ కోసం అవుట్ అండ్ అవుట్ కామెడీతో ఒక కథ సిద్ధం చేయమని సూచించినట్లు టాక్. ఎలా ఏకంగా ఒకేసారి ఇద్దరు పెద్ద హీరోలతో వర్క్ చేసే ఛాన్స్ అనుదీప్ కి వచ్చింది. ఈ రెండింటిలో ఏ సినిమా ముందుగా ఈ కుర్ర దర్శకుడు స్టార్ట్ చేస్తాడు అనేది వేచి చూడాలి.
ఇదిలా ఉంటే ప్రిన్స్ మూవీ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా మూడు రోజుల్లో ఏకంగా 16.85 కోట్లు కలెక్ట్ చేసిందని టాక్ వినిపిస్తుంది. తెలుగులో కలెక్షన్స్ ఏవరేజ్ గా ఉన్న తమిళ్ లో మాత్రం సాలిడ్ గా గ్రాస్ వస్తుందని తెలుస్తుంది. 70 శాతంకి పైగా ఆక్యుపెన్సీ ఉందని సమాచారం. అనుదీప్ కామెడీ డైలాగ్స్ తమిళనాట బాగా కనెక్ట్ అయినట్లు టాక్. ఈ నేపధ్యంలో లాంగ్ రన్ లో కచ్చితంగా 25 కోట్లకి పైగా కలెక్ట్ చేసే అవకాశం ఉంటుందని టాక్ వినిపిస్తుంది. దీపావళి కూడా కలిసి రావడంతో ఈ రోజు కూడా 5 కోట్ల వరకు కలెక్షన్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.