పిట్టగోడ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి జాతిరత్నాలు మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ అనుదీప్ కెవి. ఇతని కామెడీ టైమింగ్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపధ్యంలోనే తాజాగా శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కిన ప్రిన్స్ మూవీకి కూడా మంచి బజ్ వచ్చింది. ఈ మూవీని కూడా తనకి అలవాటైన కామెడీ టచ్ తోనే ఆవిష్కరించాడు. మొదటి రోజు ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న లాంగ్ రన్ లో ఆశించిన స్థాయిలో కలెక్ట్ చేయలేదు. ఏవరేజ్ మూవీగా నిలిచిపోయింది. అయితే ప్రిన్స్ మూవీలో అనుదీప్ నుంచి ఫ్యాన్స్ కోరుకునే ఫన్ కావాల్సినంత ఉందని చెప్పాలి.
ఇదిలా ఉంటే అనుదీప్ కెవి ఫుల్ ఫన్ జోనర్ లో సినిమాలు చేసినా కూడా బయట మూవీ ప్రమోషన్స్ లో గుంభనంగా ఉంటాడు. నెమ్మదిగా మాట్లాడుతూ చిన్న చిన్న సెటర్స్ తో ఫన్ బుల్లెట్స్ పేలుస్తూ ఉంటాడు. ఇక తాజాగా అనుదీప్ తన గురించి ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ని బయట పెట్టాడు. తనకి అరుదైన గ్లూటెమ్ కి సంబందించిన వ్యాధి ఉందని పేర్కొన్నాడు. గ్లూటెమ్ తనకి పడదని, కాఫీ తాగితే రెండు రోజుల వరకు తనకి నిద్ర పట్టదని చెప్పాడు. అలాగే ఎక్కువ కాంతిలో ఉన్న ఘాటైన వాసనలు పీల్చిన వేగంగా అలిసిపోతానని అన్నాడు.
అలాగే ఏ విషయాన్ని అంత వేగంగా అర్ధం చేసుకోలేరని కూడా చెప్పాడు. తన సెన్సస్ చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తాయని అన్నాడు. ఈ లక్షణాలు వలన తాను ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పాడు. అయితే ఇది అరుదైన వ్యాధి అని కూడా ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పుడు అనుదీప్ ఈ వ్యాధి గురించి చెప్పడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు. అలాగే అనుదీప్ ఫేస్ చేస్తున్న లక్షణాలతో ఎవరైనా ఉన్నారా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా అరుదైన వ్యాధితో బాధపడుతున్న దానినే తన బలంగా మార్చుకొని దర్శకుడిగా అనుదీప్ కెవి సత్తా చాటుతూ ఉండటం మెచ్చుకోదగ్గ విషయం.