మజ్ను సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మలయాళీ బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్. మొదటి సినిమాతోనే ఆకట్టుకున్న ఈ బ్యూటీ తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ వచ్చింది. అయితే ఈ అమ్మడుకి అవకాశాలు పుష్కలంగా వస్తున్న సక్సెస్ మాత్రం వరించలేదు. మెగా హీరోలైన అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ కి జోడీగా నటించింది.
అయితే ఆ రెండు సినిమాలు అనుకున్న స్థాయిలో అనూ ఇమ్మాన్యుయల్ కి సక్సెస్ ఇవ్వలేదు. తరువాత బాగానే అవకాశాలు అందుకుంది. అయితే ఆమె నటించిన ప్రతి సినిమా కూడా అనూ ఖాతాలో ఫ్లాప్ కేటగిరీలోనే చేరిపోయాయి. దీంతో ఐరన్ లెగ్ ముద్ర వేసి ఈ బ్యూటని పట్టించుకోవడం మానేశారు.
అయితే అల్లు శిరీష్ తో రాకేష్ శశి దర్శకత్వంలో అవకాశం సొంతం చేసుకుంది. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇంకా ఈ మూవీ టైటిల్ అయితే ప్రకటించలేదు. ఇక ఈ బ్యూటీ కూడా సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా చాలా నెలల నుంచి లేదని చెప్పాలి.
ఇక ఈమె మూవీ రిలీజ్ కి రెడీ అవుతూ ఉండటంతో మరల సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతుంది. ఇక తాజాగా ఆమెకి సంబందించిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి. బ్లాక్ శారీలో అనూ ఇమ్మాన్మూయేల్ హాట్ లుక్స్ తో తీసుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. రసికులని సైతం కొరుక్కుతినేలా ఆమె చూపులతో మన్మధభాణాన్ని వదులుతుంది. సెల్ఫీతో సోయగాలు చూపిస్తుంది.
ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ కావడంతో కుర్రకారు అనూ గాళంలో మరోసారి చిక్కుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ అల్లు శిరీష్ సినిమానే కాకుండా సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న రావణాసుర మూవీలో కూడా మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది.