టాలీవుడ్ లో హాట్ బ్యూటీగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న నటి అనూ ఇమ్మాన్యుయేల్. ఈ అమ్మడు మొదటి సినిమాతోనే తెలుగులో సూపర్ సక్సెస్ కొట్టి వరుసగా అవకాశాలు సొంతం చేసుకుంది. అయితే ఈ అమ్మడు స్టార్ హీరోలకి జోడీగా నటించిన కూడా అనుకున్న సక్సెస్ లని మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. హాట్ బ్యూటీగా బ్రాండ్ తెచ్చుకున్న హీరోయిన్ గా మాత్రం ఐరన్ లెగ్ అనే ముద్రని వేసుకుంది. దీంతో ఈ బ్యూటీని స్టార్ హీరోలు అందరూ పక్కన పెట్టారు. అయితే చాలా గ్యాప్ తర్వాత ఈ బ్యూటీ అల్లు శిరీష్ కి జోడీగా ఊర్వశివో రాక్షసివో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది.
అయితే థియేటర్స్ కి అనుకున్న స్థాయిలో ప్రేక్షకులని రప్పించలేకపోయింది. దీంతో సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ పరంగా అస్సలు రాబట్టలేకపోయింది. ఇక ఈ మూవీ రెండు వారాలలో కేవలం 3 కోట్ల గ్రాస్ ని మాత్రమే రాబట్టింది. దీంతో ఈ మూవీ కమర్షియల్ డిజాస్టర్ గా మారిపోయింది. దీంతో అనూ ఇమ్మాన్యుయేల్ తన ఐరన్ లెగ్ అనే ముద్ర ఈ సినిమాపై కూడా పడిందనే మాట వినిపిస్తుంది.
అయితే ఈ సినిమాతో ఎంతో కొంత వరకు హిట్ తెచ్చుకోవడంతో అనూకి మళ్ళీ అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఈ నేపధ్యంలోనే కార్తీ హీరోగా తెరకెక్కబోయే మూవీ జపాన్ లో ఈమెని హీరోయిన్ గా ఎంపిక చేశారు. దీంతో పాటు సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజకి జోడీగా రావణాసుర సినిమాలో ఈమె నటిస్తుంది. ఈ రెండు సినిమాలపైనే అనూ ఇమ్మాన్యుయేల్ ఆశలు పెట్టుకుంది. ఇవి కూడా ఫ్లాప్ అయితే ఆమె కెరియర్ తెలుగులో ముగిసిపోయినట్లే అని అందరూ భావిస్తున్నారు.