AP Assembly : ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలెప్‌మెంట్ అధారిటీ, ఏపీ మెట్రోపాలిటిన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలెప్‌మెంట్ అధారిటీ సవరణ బిల్లును-2022 సభలో మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రవేశపెట్టారు. ఇప్పటికే ఎన్టీఆర్ వర్సిటీ బిల్లు కారణంగా సభలో పెద్ద ఎత్తున రగడ జరిగిన విషయం తెలిసిందే. ఇది చాలదన్నట్టు మరో బిల్లును ప్రవేశ పెట్టి.. తద్వారా మరో కుట్రకు జగన్ సర్కార్ తెరదీసిందని విపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయి.
రాజధాని గ్రామాల ప్రజల అభిప్రాయాలతో పనిలేకుండా స్పెషల్ ఆఫీసర్లకు ఏకపక్ష అధికారాలు కట్ట పెడుతూ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ఆమోదం పొందడంతో రాజధాని మాస్టర్ ప్లాన్‌లో స్పెషల్ ఆఫీసర్‌ల ఆమోదంతో మార్పులు చేసేందుకు గానూ ప్రభుత్వానికి అధికారం ఉంది. బిల్లును ఎలాంటి చర్చ లేకుండా కేవలం శాలియంట్ ఫీచర్స్ చెప్పి బిల్లుకు ఆమోదం తెలిపింది. సెక్షన్ 41(3) లో మాస్టర్ ప్లాన్‌లో మార్పునకు పబ్లిక్ నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని ఉంది. పబ్లిక్‌కే కాదు అక్కడ ఉన్న లోకల్ బాడీలకు అధికారం ఉందని బిల్లు తీసుకు వచ్చామని మంత్రి తెలిపారు.
AP Assembly : ఎన్టీఆర్ వర్సిటీ బిల్లుకు ఆమోదం..
డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుకు సైతం శాసనసభ ఆమోదం తెలిపింది. వైఎస్సార్ హెల్త్ వర్సిటీగా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. బుధవారం మంత్రి రజనీ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టి ఆమోదింపచేశారు. అనంతరం మంత్రి సభలో మాట్లాడుతూ… ప్రతిపక్షంలో ఉన్నవారికి ఎన్టీఆర్ పేరు గుర్తోస్తోందని, అధికారం ఉంటే ఓ లాగా అధికారం లేకపోతే మరోలా చెపుతారని అన్నారు. ఎన్టీఆర్ మీద జగన్‌కు గౌర ఉందని స్పష్టం చేశారు. 8 మెడికల్ కాలేజీలను వైఎస్సార్ 11కు చేశారని…దానిని జగన్ 28 మెడికల్ కాలేజీలకు చేర్చారని చెప్పుకొచ్చారు. అందుకే ఆ క్రెడిట్ మనం తీసుకోవాలనే వైఎస్ఆర్ పేరు పెట్టామని తెలిపారు.