Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణలో కలకలం రేపుతోంది. ఈ స్కాంపై ఈడీతో పాటు సీబీఐ కూడా మరింత దూకూడు పెంచింది. ఇప్పటివరకు ఈ కేసులో ఈడీ, సీబీఐ ఎవరినీ అరెస్ట్ చేయలేదు. కేవలం పలువురిని విచారణకు పిలిచారు. అలాగే ఈడీ పలువురి ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. కానీ ఈడీ అలా ఉండగానే సీబీఐ స్పీడ్ పెంచింది. అరెస్ట్ ల పర్వానికి తెరలేపింది. ఇప్పటికే ఈ కేసులో ఒకరిని సీబీఐ అరెస్ట్ చేయగా.. తాజాగా మరొకరిని అరెస్ట్ చేసింది. మంగళవారం లిక్కర్ స్కాంలో విజయ్ నాయర్ ను సీబీఐ అరెస్ట్ చేసింది. తాజాగా మరొకరిని ఈడీ అరెస్ట్ చేసింది.
బుధవారం లిక్కర్ స్కాం కేసులో సమీర్ మహీంద్రుని ఈడీ అరెస్ట్ చేసింది. తెలంగాణకు చెందిన రామచంద్రపిళ్లై కలిసి సమీర్ మహీంద్రు వ్యాపారం చేస్తుున్నారు. ఇండోస్పిరిట్ ఛైర్మన్ గా సమీర్ మహీంద్రు పనిచేస్తున్నాడు. రామచంద్రపిళ్లై. సమీర్ హమీంద్రు కలిసి రూ.2.30 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. వసూళ్లు చేసిన డబ్బులను ఢి్లీలోని ప్రభుత్వ పెద్దలకు ఇచ్చినట్లు అభియోగాలు వస్తున్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో హైదరాబాద్ కు చెందిన ప్రముఖ లిక్కర్ వ్యాపారి రామచంద్రన్ పిళ్లై ఏ1గా ఉన్నారు. ఇక ఆయన వ్యాపారాల్లో భాగస్వామిగా బోయినపల్లి అభిషేక్, గండ్ర ప్రేమసాగర్ ఉన్నట్లు సీబీఐ అనుమానిస్తోంది. ఇప్పటికే ఈడీ రామచంద్రన్ పిళ్లై ఇళ్లతో పాటు అభిషేక్,గండ్ర ప్రేమ సాగర్ ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో పలు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకుంది. బినామీల ద్వారా లిక్కర్ దందాల్లో పెట్టుబడులు పెట్టారనే అనుమానాలను దర్యాప్తు సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి.
Delhi liquor scam:
బీనామీలతో అనధికారికంగా పెట్టుబడులు పెట్టి బ్లాక్ మనీని వైల్ చేశారనే అనుమానాలు బలంగా ఉన్నాయి. ఇప్పుడు ఈడీ అరెస్ట్ లు ప్రారంభించడంతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో గుబులు మొదలైంది. రానన్న రోజుల్లో తెలంగాణకు చెందని వ్యక్తులను కూడా అరెస్ట్ చేసే అవకావముందనే ప్రచారం సాగుతోంది.