NTR: ఏపీ రాజకీయాలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చుట్టు తిరుగుతున్నాయి. వైసీపీ అధినేత సీఎం జగన్.. ఇటీవల ఏపీ అసెంబ్లీ సమావేశాలలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తున్నట్లు బిల్లు తీసుకురావటం దానికి సభ ఆమోదించటం తెలిసిందే. దీంతో ఎన్టీఆర్ పేరు మార్చడం పట్ల నందమూరి కుటుంబ సభ్యులు ఇంకా పలువురు రాజకీయ పార్టీల నేతలు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది.
జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ చంద్రబాబు గవర్నర్ తో కూడా బేటి అయ్యారు. ఎన్టీఆర్ ఇంకా కళ్యాణ్ రామ్ సోషల్ మీడియాలో ట్వీట్ లు పెట్టడం జరిగింది. ఎన్టీఆర్ ఇంకా వైయస్సార్ ఇద్దరూ కూడా గొప్ప నాయకులంటూ ఎన్టీఆర్..ట్వీట్ చేయటం రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఎన్టీఆర్ ని వైఎస్ఆర్ తో పోల్చడం పట్ల టిడిపి శ్రేణులు మండిపడుతున్నారు. ఇక ఇదే సమయంలో వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ .. జూనియర్ ఎన్టీఆర్ పై మండిపడ్డారు. ఎన్టీఆర్ అంటే వైసీపీకి గౌరవం ఉందని తెలిపారు. అందువల్లే జిల్లాల విభజనలో ఓ జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టినట్లు స్పష్టం చేశారు.
మరి అటువంటి సమయంలో జిల్లాకు పేరు పెట్టిన టైంలో లేవని నోరులు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయి. స్వర్గీయ ఎన్.టి.రామారావు పై కొందరు చెప్పులు విసిరించారు, అప్పుడెందుకు నందమూరి కుటుంబ సభ్యులు మాట్లాడలేదు. రామారావు గారు స్థాపించిన పార్టీని వేరొకరు కబ్జా చేశారు. ఆ సమయంలో రామారావు గారు ఎంతో ఆవేదన చెందారు. మరి అలాంటి సమయంలో నందమూరి కుటుంబ సభ్యులు ఎందుకు పట్టించుకోలేదని మరో ప్రశ్న వేయడం జరిగింది. ఇదే సమయంలో తాత కోసం ట్విట్ట్లు చేయడం కాదు.. తొడగొట్టి పోరాటం చెయ్.. అంటూ పరోక్షంగా ఎన్టీఆర్ పై వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సెటైర్ లు వేశారు. దీంతో అనిల్ కుమార్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఏపీ రాజకీయాల్లో వైరల్ అవుతున్నాయి.