బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో అనిల్ రావిపూడి స్టైల్, బాలయ్య యాక్షన్ కలిసి ఈ సినిమా కంటెంట్ ఇంటరెస్టింగ్ గా ఉంటుందని గతంలోని దర్శకుడు క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇది పూర్తయిన వెంటనే అనిల్ రావిపూడి తన సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ దశలో ఉంది. బాలయ్య కోసం హీరోయిన్ ని ఎంపిక చేసే పనిలో పడ్డారు. నయనతారని బాలకృష్ణకి జోడీగా ఖరారు చేశారనే మాట గట్టిగా వినిపిస్తుంది.
వారిద్దరిని హిట్ కాంబినేషన్ కాబట్టి ప్రేక్షకులు కూడా బాగా కనెక్ట్ అవుతారని అలా ప్లాన్ చేసినట్లు టాక్. దిల్ రాజు ఈ మూవీ కోసం నయనతారకి రెమ్యునరేషన్ కూడా గట్టిగానే ఇచ్చాడని టాక్ నడుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఒక అప్డేట్ ఇప్పుడు వినిపిస్తుంది. ఈ మూవీకి సంబందించిన స్క్రిప్ట్ మొత్తం రెడీ కావడంతో అనిల్ రావిపూడి వీలైనన్ని తక్కువ రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. లాంగ్ షెడ్యూల్ కాకుండా వేగంగా రెండు, మూడు షెడ్యూల్స్ లో సినిమా ఫినిష్ చేయాలని భావిస్తున్నట్లు బోగట్టా.
అందుకుగాను ఇప్పటి నుంచి పక్కా ప్లాన్ చేసుకొని సెట్స్ పైకి వెళ్ళబోతున్నారనే మాట వినిపిస్తుంది. ఈ సినిమాని కమర్షియల్ అండ్ కామెడీ యాక్షన్ మూవీగా ఆవిష్కరించబోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ మూవీలో బాలకృష్ణ కూతురు పాత్రలో శ్రీలీల నటిస్తుందని టాక్. తండ్రి, కూతుళ్ళ సెంటిమెంట్ ప్రధానంగా సినిమా కథ ఉంటుందనే మాట బలంగా వినిపిస్తుంది. ఏది ఏమైనా అనిల్ రావిపూడి సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ కి ఎలాంటి డోకా ఉండదు అనే సంగతి అందరికి తెలిసిందే. బాలయ్య మూవీలో కూడా అదే ఫార్మాట్ ని ఫాలో అవ్వబోతున్నారు.