Andrea Jeremiah: కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఆండ్రియా జర్మీయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెరియర్ పరంగా సింగర్ గా ఎంట్రీ ఇచ్చిన జర్మీయ నటిగా బాగా పాపులర్ అయింది. సౌత్ ఇండస్ట్రీలో నటిగా అవకాశాలు అందుకుంటూ విజయవంతమైన కెరియర్ కొనసాగిస్తూ ఉంది. సినిమా అవకాశాలు మాత్రమే కాదు ఫహద్ ఫాజిల్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ వంటి వారితో ప్రేమాయణం కూడా నడిపించు ఫేమస్ అయ్యింది. అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గేదేలే రీతిలో రెచ్చిపోతుంటది. ఇంకా సోషల్ మీడియాలో అదరగొట్టే అందాలతో ఫోటోలకు ఫోజులిస్తూ ఆండ్రియా జర్మీయ కుర్రకారులో సెగలు పెంచుతూ ఉంటది. ఈ రీతిగానే ఇంస్టాగ్రామ్ లో అద్దం ముందు లైట్ల మధ్య.. పర్పుల్ కలర్ డ్రెస్ లో లేటెస్ట్ గా దర్శనమిచ్చింది.
అద్దంలో క్లివెజ్ షోతో సెగలు పుట్టిస్తున్న బోల్డ్ బ్యూటీ.. చూపులతోనే చంపేస్తోంది. అద్దం చుట్టూ వెలుగుతున్న లైట్లు మధ్య..ఆండ్రియా జర్మీయ అందాలు అల్లాడిస్తున్నాయి. కొద్ది గంటల క్రితం పోస్ట్ చేసిన ఈ ఫోటోలకు భారీ ఎత్తున రెస్పాన్స్ వస్తూ ఉంది. ప్రస్తుతం “పిశాచి 2″లో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కు సిద్ధంగా ఉంది. తెలుగు, తమిళం, మలయాళం భాషలో విడుదలవుతున్న ఈ సినిమాకి ఆండ్రియా జర్మీయ.. సొంతంగా డబ్బింగ్ చెప్పడం విశేషం.
ఇటీవల ఆండ్రియా జర్మీయ “పిశాచి 2” సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తాను మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చినట్లు తెలిపింది. తన కుటుంబంలో తొలిపట్టాభద్రుడు తన తండ్రి అని.. ఆయన న్యాయవాది అని స్పష్టం చేసింది. తన పద్దెనిమిదవ సంవత్సరంలో తండ్రి పియానో కొనిచ్చారని.. అప్పటినుండి మ్యూజిక్ పై మరింత శ్రద్ధ పెట్టినట్లు తెలిపింది.
ఆ తర్వాత నటనపై దృష్టి సారించడంతో .. తండ్రి ఇచ్చిన పియానో షోకేజ్ లో దాయడం జరిగిందని జర్మీయ స్పష్టం చేసింది. సోఫియా ట్రస్ట్ పేరుతో అనాధ పిల్లల చదువుకు ఎంతో సాయం చేస్తున్నట్లు పేర్కొంది. భారతదేశం ఆకలి లేని ..పేదరికం లేని దేశంగా మారాలంటే విద్య ఒక్కటే మార్గమని గట్టిగా తాను నమ్ముతానని ఆండ్రియా జర్మీయ.. “పిశాచి 2” ప్రమోషన్ కార్యక్రమంలో తెలియజేసింది.