ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ ఆరు నెలల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే నెక్స్ట్ ఎలక్షన్స్ లో గెలుపొందడం కోసం అధికార ప్రతిపక్ష పార్టీలు కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నాయి.ఈసారి కూడా అధికార పార్టీ పొత్తు లేకుండా సింగిల్ గా బరిలోకి దిగబోతుంది.కానీ ప్రతిపక్షాల మధ్య మాత్రం కన్ఫ్యూజన్ కొనసాగుతుంది.
ఎన్నికల బరిలోకి ఒంటిరిగా వెళ్తే ఓటమి తప్పదని భావిస్తున్న తెలుగుదేశం జనసేనని, బిజేపిని కలుపు కెళ్ళడానికి ఎత్తుల మీద ఎత్తులు వేస్తుంది.ఆ రెండు పార్టీలను బలవంతంగా తమతో కలుపుకునేందుకు గ్రౌండ్ లెవెల్ లో చేసిన ప్రయత్నాలు కొంతమేర ఫలితాన్ని చూపిస్తున్నాయి.కానీ పొత్తు ఫైనల్ డెసిషన్ పవన్ చేతిలోనే ఉంది.ప్రస్తుతానికి తెలుగుదేశంతో పొత్తుకి నో అంటున్న పవన్ ఎన్నికల సమయానికి ఆ మాటకి కట్టుబడి ఉంటారో లేదో వేచి చూడాల్సివుంది.