AndhraPradesh: ఏపీ మరియు తమిళనాడు బోర్డర్ లో ఇరు రాష్ట్రాలకు చెందిన వాహనాలు, మనుషుల రాకపోకలు సాగుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఏపీలోని తిరుమలకు తమిళనాడు నుండి భారీగా భక్తులు వస్తూ ఉంటారు. నిత్యం రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలతో సరిహద్దు వద్ద సందడి ఉంటుంది. కానీ తాజాగా జరిగిన సంఘన నేపథ్యంలో ఏపీ, తమిళనాడు బోర్డర్ లో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. దీంతో ఏపీలోకి ఎవరూ ప్రవేశించకుండా, ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.
ఇంతకీ ఏం జరిగిందంటే?:
ఏపీలోని తిరుపతి నుండి చెన్నైకి కొంతమంది లా విద్యార్థులు వెళుతున్నారు. వారు ఏపీలోని వడమాలపేట టోల్ ప్లాజాకు వారు వెళుతున్న వాహనాలు చేరుకోగా.. సదరు వాహనాలకు ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్యాగ్ లు పని చేయలేదు. దాంతో టోల్ చెల్లింపు ఆలస్యమైంది. ఫలితంగా టోల్ ప్లాజ్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ట్రాఫిక్ జామ్ అవుతోందని, త్వరగా టోల్ కట్టాలని టోల్ ప్లాజ్ సిబ్బంది కోరారు.
టోల్ విషయంలో టోల్ ప్లాజా సిబ్బందితో విద్యార్థులు గొడవకు దిగారు. కొందరు విద్యార్థులు ఏకంగా టోల్ ప్లాజా సిబ్బంది మీద దాడికి పూనుకున్నారు. దీంతో గంటపైగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు, స్థానికులు విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.అయినా కూడా విద్యార్థులు వినకపోవడంతో.. పోలీసులుకు సమాచారం అందించారు. వెంటనే రంగ ప్రవేశం చేసిన పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు.
AndhraPradesh:
అయితే ఈ విషయం తమిళనాడులో తెలియడంతో కొందరు యువకులు ఏపీలోకి వచ్చి గొడవ చేయడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన ఏపీ పోలీసులు వెంటనే బోర్డర్ లో సెక్యూరిటీని అలర్ట్ చేశారు. యువకులు టోల్ ప్లాజా మీద దాడి చేసే అవకాశం ఉందని సమాచారం అందుకున్న పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్త్నారు. అత్యవసర వాహనాలను మాత్రం ప్రస్తుతం అనుమతిస్తున్నారు.