దసరా సందర్భంగా తాజాగా విజయవాడలో హెలికాప్టర్ రైడ్ ను ప్రారంభించనున్నారు.అందుకోసం విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో తాజాగా హెలిప్యాడ్ ను ఏర్పాటు చేశారు.ఆరు నిమిషాలు ఈ రైడ్ కోసం 3500 రూపాయిలు పది నిమిషాల రైడ్ కోసం 6,000 రూపాయిలు ఛార్జ్ చేస్తున్నారు.ఈ రైడ్ లను మంత్రి వెల్లంపల్లి ప్రారంభించబోతున్నారు.
ఈ రైడ్ తో స్థానికులు నగర అందాలను చూడబోతున్నారు.రెండేళ్ల లోపు ఉన్న పిల్లలకు ఈ రైడ్ లో ఫ్రీగా పాల్గొనవచ్చు అని తెలిపారు.ఇప్పటికే హైదరాబాద్ వాసులకు అందుబాటులో ఉన్న ఈ సర్వీస్ ను విజయవాడలో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు.